పాకిస్తాన్ కుట్రల్ని బయటపెట్టిన జైషే మహ్మద్ చీఫ్ మసూద్

పుల్వామా ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ సంస్థలపై ఇండియా వైమానిక దాడులు చేసిన సంగతి అందరికి తెలిసిందే.

ఇక ఆ దాడులని సహించలేకపోయిన పాకిస్తాన్ భారత్ పై కవ్వింపు చర్యలకి పాల్పడింది.

పాకిస్తాన్ దాడులని భారత్ గట్టిగా తిప్పి కొట్టి పాకిస్తాన్ ని అన్ని రకాలుగా ఇరుకున పెట్టడంతో పాటు దౌత్యపరంగా కూడా ఒత్తిడి తెచ్చింది.దీంతో జైషే మహ్మద్ సంస్థ మీద, అలాగే జైషే చీఫ్ మసూద్ మీద వెంటనే నిషేధం విధించి అతన్ని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేసాయి.

అయితే మసూద్ ని అరెస్ట్ చేస్తే పాకిస్తాన్ లో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని గ్రహించిన ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసింది.మసూద్ అజార్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని, అతను ఇంటి నుంచి కదలలేని స్థితిలో ఉన్నాడని చెప్పుకొచ్చారు.

అయితే తాజాగా జైషే చీఫ్ ఆ వార్తలని ఖండిస్తూ జైషే మహ్మద్ అధికారిక పత్రికలో కీలక ప్రకటన చేసాడు.పాకిస్తాన్ ప్రభుత్వం తాను అనారోగ్యంతో ఉన్నట్లు చేసిన ప్రచారంలో వాస్తవం లేదని తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు స్పష్టం చేసారు.

Advertisement

అలాగే తనతో మోడీ పోటీకి వస్తే తన బలమెంతో తెలుస్తుందని మసూద్ సవాల్ విసిరాడు.తాను గత పదిహేడు సంవత్సరాల నుంచి హాస్పిటల్ ముఖం చూడలేదని స్పష్టం చేసాడు.

అలాగే బాలంకోట్ పై దాడిలో తమ జైషే సైనికులు ఎవరు చనిపోలేదని తన కాలమ్ లో చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు