దర్శకుడు మారుతి ప్రతి రోజు పండుగే సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు.సినిమాలు చేయడం లేదు అంటూ విమర్శలు వచ్చాయి.
చాలా గ్యాప్ తర్వాత గోపీచంద్ తో పక్కా కమర్షియల్ అనే సినిమాను ప్రకటించాడు.కొన్ని కారణాల వల్ల సినిమాను పట్టాలెక్కించలేక పోయాడు.
ఆ సమయంలోనే సంతోష్ శోభన్ తో ఒక సినిమాను ముగించాడు.మంచి రోజులు వచ్చాయి అనే టైటిల్ తో ఆ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.
విడుదలకు కూడా కూడా సిద్దం అయ్యింది. మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా విడుదల తేదీ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది.
ఇక ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే మారుతి మరో ప్రాజెక్ట్ ను కూడా మొదలు పెట్టాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

మారుతి దర్శకత్వంలో 3రోజెస్ అనే ప్రాజెక్ట్ రూపొందింది.ఇది ఒక వెబ్ సిరీస్ అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది.ముగ్గురు అమ్మాయిల జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.
భారీ ఎత్తున అంచనాలున్న ఈ వెబ్ సిరీస్ ను ఆహా లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.ఈ వెబ్ సిరీస్ ను ఎప్పుడు స్ట్రీమింగ్ చేసేది అతి త్వరలోనే ప్రకటించబోతున్నారు.
మారుతి సినిమా మహా ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది.కనుక వెబ్ సిరీస్ విషయంలో కూడా ఖచ్చితంగా ఎంటర్ టైన్ మెంట్ కావాల్సినంత ఉంటుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ వెబ్ సిరీస్ ను గీతా ఆర్ట్స్ కు సన్నిహితుడు అయిన ఎస్ కే ఎన్ నిర్మించాడు. ఈ వెబ్ సిరీస్ తర్వాత వెంటనే గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఈ మూడు ప్రాజెక్ట్ లతో మారుతి జోరు మళ్లీ కనిపిస్తుంది.