టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లలో మారుతి( Tollywood Director Maruthi ) ఒకరు.ఈయన తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు.
ఇక మారుతి ప్రజెంట్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాకపోయినా ఈ సినిమా కన్ఫర్మ్ అయ్యింది.
షూట్ కూడా స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు పెరిగి పోయాయి.మారుతి సినిమాలన్నీ కామెడీ వేలో సాగిపోతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాయి.మరి ప్రభాస్( Prabhas ) ను ఆ తరహా జోవియల్ రోల్ లో చూసి చాలా కాలం అవుతున్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా మారుతి లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు.మారుతి మాట్లాడుతూ తన లైనప్ లో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi )తో సినిమా చేయాల్సి ఉందని ఆయన ఓకే చేసారని తెలిపాడు.
ఇక ఈ చిత్రం చిరు మార్క్ ఎంటర్టైనర్ తరహాలో ప్లాన్ చేశామని తన టైమింగ్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఒక ఘరానా మొగుడు తరహాలో ఉంటుంది అంటూ ఈయన రివీల్ చేయడంతో మెగాస్టార్ లైనప్ లో మారుతి కూడా ఉన్నాడని ఫిక్స్ అయ్యింది.

మెగాస్టార్ ప్రస్తుతం రెండు సినిమాలను ప్రకటించాడు.156, 157 సినిమాలు ప్రకటించాడు.చిరు 156వ ప్రాజెక్ట్ ను మెగాస్టార్ కూతురు తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.
ఇక చిరు 157వ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో నిర్మించనున్నారు.బింబిసార డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి( Director Mallidi Vasishta ) తెరకెక్కిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు.
ఇవి అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నాయి.








