మెటా సీఈఓ అయిన మార్క్ జుకర్‌బర్గ్( Mark Zuckerberg ) ఇటీవల కాలంలో సరికొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.తాజాగా ఆయన మరో కొత్త అభిరుచిని ఎంచుకున్నారు, అదే కత్తి తయారీ.
అతను ఇటీవల బలం, పదునుకు ప్రసిద్ధి గాంచిన సాంప్రదాయ జపనీస్ కత్తి రకమైన కటనాను( Katana ) తయారు చేయడం నేర్చుకున్నాడు.ఆ అనుభవాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు.
కటన అనేది పొడవాటి, ఒకే అంచుగల బ్లేడ్‌ను కలిగి ఉంది.రెండు చేతులతో పట్టుకునేలా దీనిని తయారు చేస్తారు.
పూర్వకాలంలో దీనిని సమురాయ్ యోధులు( Samurai ) రక్షణ కోసం, వారి స్టేటస్‌కు చిహ్నంగా ఉపయోగించారు.
జుకర్‌బర్గ్ కటనాల గురించి మాత్రమే నేర్చుకోలేదు.
అతను కత్తి తయారీ ప్రాసెస్‌లో మొదటి స్టెప్ నుంచి చివరి స్టెప్పు వరకు యాక్టివ్‌గా పాల్గొన్నారు.మండుతున్న కత్తిని సుత్తితో కొడుతూ దానిని పదును చేశారు.
అతనికి జపాన్‌కు( Japan ) చెందిన ఒక మాస్టర్ ఖడ్గకారుడు మార్గనిర్దేశం చేశారు.సోషల్ మీడియాలో, జుకర్‌బర్గ్ ఈ ప్రక్రియ గురించి అనేక అప్‌డేట్స్ పోస్ట్ చేశారు.
అందులో కత్తిసాముతో పాటు వారు కలిసి తయారు చేసిన కత్తితో ఉన్న ఫొటోలు ఉన్నాయి.

వీడియోలు వారు స్టీల్‌ను కటనాగా మలచడానికి దానిపై పనిచేస్తున్నట్లు చూపించాయి.ఒక వీడియోలో జుకర్‌బర్గ్ తాను తయారు చేసిన కత్తిని ఉపయోగించడం కూడా కనిపిస్తుంది.కటనా కత్తి తయారీ గురించి జుకర్‌బర్గ్ పోస్ట్‌ల ద్వారా నెటిజన్లు తెలుసుకున్నారు.
కొందరు చిన్ననాటి కల కోసం మార్క్ ఇప్పుడు చేసిన సాధనను మెచ్చుకున్నారు.కొంతమంది వ్యాఖ్యాతలు కత్తి తయారీ నేర్చుకోవడం పట్ల మార్క్ అంకితభావాన్ని ప్రశంసించారు, అతన్ని యోధుడు అని పిలిచారు.

కత్తి మేకింగ్‌తో పాటు, జుకర్‌బర్గ్ మరో కొత్త ప్రాజెక్ట్‌ను చేపట్టారు.అతను హవాయిలోని( Hawaii ) కాయైలోని ఒక గడ్డిబీడులో పశువులను పెంచడం ప్రారంభించారు.చాలా నాణ్యమైన గొడ్డు మాంసం ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు చేపట్టారు.పశువులు వాగ్యు, అంగస్ అనే ప్రత్యేక జాతులు.వాగ్యు అనేది ప్రీమియం గొడ్డు మాంసం.అంగస్ USలో ప్రసిద్ధి చెందిన స్టీక్.
జుకర్‌బర్గ్ పశువులకు మకాడమియా గింజలు, బీర్‌తో కూడిన ప్రత్యేకమైన ఆహారం అందిస్తున్నారు.







