విశాఖ కీలక మావోయిస్ట్ నేత సునీల్ అలియాస్ రైనును పోలీసులు అరెస్ట్ చేశారు.ఆంధ్రా, ఒడిశాతో పాటు ఛత్తీస్ గఢ్ లో రైను మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా ఉన్న విషయం తెలిసిందే.
మావో నేత రైనుపై రూ.5 లక్షల రివార్డు కూడా ఉంది.సునీల్ అలియాస్ రైను 2000వ సంవత్సరం నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యేలు కిడారి, సివేరి సోమ హత్య కేసులో రైను కీలక నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.







