తిరుమల శ్రీవారిని జబర్దస్త్ బృందం దర్శించున్నారు.గురువారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు సంజయ్ స్వరూప్, సినీనటి శ్రీలక్ష్మీ, చైల్డ్ కమెడియన్స్ యోధ, దివెన, నటుడు గెటప్ శీనులు కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన గెటప్ శీను మీడియాతో మాట్లాడుతూ.
కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని,కోవిడ్ తర్వాత మొదటి సారి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం జరిగిందన్నారు.భోళా శంకర్, రాజు యాదవ్,పొలిమేర-2, హనుమెన్ వంటి చిత్రాల్లో నటిస్తున్నట్లు గెటప్ శీను తెలియజేశారు.