తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో మంచు ఫ్యామిలీ ఒకటి.మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు వారసులుగా విష్ణు మనోజ్ లక్ష్మి ప్రసన్న ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ తన సినీ కెరియర్లో సినిమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందారు.అయితే ఈయన తన వ్యక్తిగత కారణాలవల్ల కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

ఈ విధంగా మనోజ్ చాలా సంవత్సరాల తర్వాత తన కొత్త సినిమాని ప్రకటించారు.ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నటువంటి మనోజ్ పెళ్లైన రెండు సంవత్సరాలకి విడాకులు తీసుకున్నారు.అప్పటినుంచి ఒంటరిగా ఉన్నటువంటి ఈయన దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె మౌనిక రెడ్డితో రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి.ఇక వీరి వివాహం మార్చి మూడవ తేదీ జరగనున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే మనోజ్ రెండో పెళ్లికి సిద్ధం కావడంతో ఇప్పటికే మంచు వారి ఇంట పెళ్లి సందడి మొదలైనట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే మంచు ఫ్యామిలీలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఎంతో ఘనంగా ప్రారంభించారు.ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభం కావడంతో పెళ్లి పనులను మహా మంత్రం పూజతో ప్రారంభించినట్టు తెలుస్తుంది.ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.







