సౌత్ సినిమాలు బాలీవుడ్ వాళ్లకు వణుకు పుట్టిస్తున్నాయట.. ప్రముఖ నటుడి కామెంట్స్ వైరల్!

గత కొన్నేళ్లలో సౌత్ సినిమాల బడ్జెట్ పెరగడంతో పాటు ఈ సినిమాల రేంజ్ కూడా పెరిగింది.బాహుబలి1, బాహుబలి2, కేజీఎఫ్1, పుష్ప ది రైజ్, కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్ సినిమాలు హిందీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి.ఈ సినిమాలు హిందీలో కలెక్షన్ల విషయంలో రికార్డులను సృష్టించాయి.హిందీ సినిమాలు సౌత్ లో సక్సెస్ సాధించకపోయినా సౌత్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి.

 Manoj Bajpayee Stunning Comments On Hindi Dubbed Southern Films Details, South M-TeluguStop.com

ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పాయ్ తాజాగా మాట్లాడుతూ కరోనా తర్వాత విడుదలైన పుష్ప ది రైజ్ హిందీలో 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుందని కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్ ఇప్పటికీ భారీస్థాయిలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయని ఆయన అన్నారు.సౌత్ సినిమాలు హిందీలో హవా చూపిస్తుండటం బాలీవుడ్ లో చాలామందిని కలవరపెట్టిందని ఆయన తెలిపారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన హిందీ సినిమాలకు 200 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని

Telugu Manoj Bajpayee, Bollywood, Kgf Chapter, Pushpa-Movie

డబ్బింగ్ సినిమాలైన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 మాత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయని మనోజ్ బాజ్ పాయ్ పేర్కొన్నారు.బాలీవుడ్ ఇండస్ట్రీకి సౌత్ సినిమాల సక్సెస్ ఒక పాఠమని సౌత్ సినిమాలు బాలీవుడ్ మేకర్స్ కు వణుకు పుట్టిస్తున్నాయని ఆయన వెల్లడించారు.

Telugu Manoj Bajpayee, Bollywood, Kgf Chapter, Pushpa-Movie

సౌత్ మేకర్స్ ప్రతి సన్నివేశాన్ని వాస్తవంగా చిత్రీకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.మనోజ్ బాజ్ పాయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.రాబోయే రోజుల్లో మరిన్ని సౌత్ సినిమాలు బాలీవుడ్ లో సత్తా చాటే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.కేజీఎఫ్2 బాలీవుడ్ ఇండస్ట్రీలో కళ్లు చెదిరే రికార్డులను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.కేజీఎఫ్2 మూవీ ఫుల్ రన్ లో హిందీలో ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube