మంజీరనది పరవళ్ళు.. జలదిగ్భందంలో దుర్గ మాత ఆలయం

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో చెరువులు కుంటలు పొంగి పొర్లుతున్నాయి.కొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు వరద ప్రభావంతో కొట్టుకుపోవడంవల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 Manjeera River Over Flows Durga Mata Temple Drowned, Manjeera River Over Flows ,-TeluguStop.com

మంజీరా నది పర్వాహక ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి, ఏడుపాయల దేవస్థానంలో గల వనదుర్గ ప్రాజెక్ట్ పొంగి పొర్లుతుంది.ఆలయం ముందు నుండి మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తు పరవళ్ళు తొక్కుతుండడంతో గత నాలుగు రోజుల నుండి ఆలయం జలదిబ్బంధంలోవుంది.

ఆలయానికి వచ్చే భక్తుల దర్శన నిమిత్తం ముందుజాగ్రత్త చర్యలో భాగంగా ఆలయ ఈవో సార శ్రీనివాస్, ఆలయ చైర్మన్ సాతెలిబాలగౌడ్, ఆలయంలోని ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ప్రతిష్టించి భక్తులకు దర్శనం కనిపిస్తున్నారు.ఆదివారం ఆలయానికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మంజీరా నది పరవళ్లను తిలకించి గంగమ్మకు హారతి ఇచ్చారు.

అనంతరం జోగిని శ్యామల తో కలిసి రాజగోపురంలోని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ఈవో మరియు ఆలయ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, మండల పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీలు, పాలకమండలి సభ్యులు,నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube