Pawan Kalyan Mani Sharma : పవన్ కళ్యాణ్ పట్టుదల వల్లే ఆ సినిమాలో ఆ పాట పెట్టాం.. మణిశర్మ వైరల్ కామెంట్స్?

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి, ఆయనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 Manisharma Reveled Shocking Fact About Kushi Movie Song , Manisharma , Kushi Mov-TeluguStop.com

మెగాస్టార్ సోదరుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ హీరోలలో ఒకరిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.పవన్ కళ్యాణ్ తెలుగులో నటించిన కొన్ని సినిమాలే అయినప్పటికీ నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అవ్వడంతో పవన్ కి యూత్ లో భారీగా క్రేజ్ ఏర్పడింది .అంతేకాకుండా మాస్ హీరో నిజానికి సరికొత్త డెఫినిషన్ చెప్పింది పవన్ కళ్యాణ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

పవన్ కళ్యాణ్ ఎంతోమంది యువ దర్శకులకు అవకాశం ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.

అటువంటి వారిలో దర్శకుడు ఎస్ జె సూర్య కూడా ఒకరు.ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో నటించిన విషయం తెలిసిందే.

ఆ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.ఆ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.

ఆ సినిమాలోని పాటలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి.ముఖ్యంగా ఖుషి సినిమాలో యే మేరా జహ అనే పాట అప్పట్లో సంచలన విజయం సృష్టించింది.

అంతేకాకుండా అప్పటి వరకు టాలీవుడ్ లో వచ్చిన ఏకైక హిందీ పాట కూడా ఇదే అని చెప్పవచ్చు.

Telugu Kushi, Manisharma, Pawan Kalyan, Sj Surya, Tollywood-Movie

ఈ పాట చాలామందికి అర్థం కాకపోయినా విని ఎంజాయ్ చేశారు.ఇప్పటికీ ఈ పాట అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది.అయితే ఈ సినిమాలో ఈ పాటని పవన్ కళ్యాణ్ ఐడియా వల్లనే పెట్టారట.

ఇదే విషయాన్ని తాజాగా మణిశర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.పవన్ ఐడియా నుంచి వచ్చిన ఈ పాట చార్ట్ బస్టర్ అవుతుందని ఎవరు ఊహించలేదు అని చెప్పుకొచ్చారు మణిశర్మ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube