రాహుల్ గాంధీ నైట్ క్లబ్ లో పార్టీ చేసుకుంటున్న వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. రాజకీయంగా కాంగ్రెస్ నూ, రాహుల్ ను టార్గెట్ చేసుకుంటూ.
కాంగ్రెస్ వ్యతిరేక పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి.ఈ వ్యవహారంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించారు.
చైనా దౌత్యవేత్తల తో కలిసి నేపాల్ నైట్ క్లబ్ లో రాహుల్ గాంధీ పార్టీ చేసుకుంటున్న వీడియో తో చైనా హనీ ట్రాప్ పెరుగుతుండడం కలవరపెడుతోంది అని విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు.నైట్ క్లబ్ లో చైనీస్ రాయబారి హౌ యాంకీ రాహుల్ గాంధీ తో ఉన్నారని విజయసాయి పేర్కొన్నారు.
నరేంద్రమోదీ విదేశీ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్న సమయంలోనే ఆ పార్టీ సొంత నేతే వివాదంలో చిక్కుకున్నారు అంటూ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేశారు.
దీనిపై కాంగ్రెస్ ఘాటుగానే స్పందించింది.
ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాకూర్ విజయసాయి రెడ్డి కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.అవినీతి విజయసాయిరెడ్డి నిజం తెలుసుకోవాలంటూ వ్యాఖ్యానించిన ఆయన మీ సమస్య జగన్ రెడ్డి పై ఉన్న అవినీతి కేసులని మాకు తెలుసు.
కానీ నిజం మర్చిపోకండి నేపాల్ అంబాసిడర్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ నేపాల్ వెళ్లారని మాణిక్యం ఠాకూర్ క్లారిటీ ఇచ్చారు.అంతేకాదు నేపాల్ కు చెందిన కాట్ మాన్ పోస్ట్ పేపర్ క్లిప్ ను మాణిక్యం ఠాకూర్ తన కౌంటర్ కు జతచేశారు.
రాహుల్ గాంధీ వివాహ వేడుకకు హాజరు కావడంలో తప్పేముంది అంటూ నిలదీశారు.

పెళ్లి వేడుకలకు రాహుల్ గాంధీ వెళ్లడం నేరమా ? పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పుట్టినరోజు వేడుకలకు ఎలాంటి ఆహ్వానం లేకుండానే ప్రధాని నరేంద్రమోదీ వెళ్ళినట్లు రాహుల్ గాంధీ వెళ్ళలేదు కదా అంటూ మరో కాంగ్రెస్ నేత నూర్జేవాలా కౌంటర్ ఇచ్చారు.మొత్తంగా అనవసర వివాదం లో తలదూర్చి విజయసాయి వైసీపీకి కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టినట్టుగా కనిపిస్తున్నారు.