టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో మాణిక్ రావు ఠాక్రే సంచలన వ్యాఖ్యలు..!!

టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం ముగిసింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కష్టపడి గెలిచాం అని పేర్కొన్నారు.ఇక ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అందరూ కష్టపడాలని.

గెలవాలని సూచించారు.పార్టీకి నష్టం కలిగే పనులు ఎవరు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

కర్ణాటకలో మాదిరిగా కష్టపడితే తెలంగాణలో కూడా గెలుపు సాధ్యమని మాణిక్ రావు ఠాక్రే పేర్కొన్నారు.ఎన్నికలకు నాయకులంతా సిద్ధంగా ఉండాలి.

Advertisement
ManikRao Thakre's Sensational Comments In TPCC Wide Meeting Congress, ManikRao T

ఇచ్చిన బాధ్యతలను విస్మరిస్తే ఉపేక్షించేది లేదు.ఎన్నికలలో సర్వేల ఆధారంగా కష్టపడ్డ వారికే టికెట్లు ఇవ్వటం జరుగుద్ది.

ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాణిక్ రావు ఠాక్రే విమర్శలు చేశారు.

Manikrao Thakres Sensational Comments In Tpcc Wide Meeting Congress, Manikrao T

కేసీఆర్ కాంగ్రెస్ కి మాత్రమే వ్యతిరేకంగా ఉన్నాడు బీజేపీతో ఫ్రెండ్లీగా ఉన్నారని వ్యాఖ్యానించారు.బీఆర్ఎస్.బీజీపీతో  లోపాయికారి ఒప్పందాన్ని ప్రజలకు వివరించేలా ఎన్నికలలో నేతలు ప్రచారాన్ని చేయాలని సూచించారు.

రాష్ట్రంలోని సమస్యలపై అన్ని స్థాయిల్లో పోరాట కార్యక్రమాలు చేయాలని పేర్కొన్నారు.మీడియాలో ఇబ్బందులు పెట్టే వార్తలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

వీటన్నిటిని ఎదుర్కొంటూనే మరోపక్క ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం కలిగించేలా నేతలు కృషి చేయాలని మాణిక్ రావు ఠాక్రే టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు