మునుగోడులో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.నియోజకవర్గంలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్.మునుగోడు మండల ఇంఛార్జ్ లతో భేటీ కానున్నారు.
ఈ సమావేశంలో ఉపఎన్నికకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.సెప్టెంబర్ 17 నుంచి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేయనున్నారు.ఈ నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.ఇప్పటికే మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఎన్నికల ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.