తెలుగు బుల్లితెర పేక్షకులకు జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం యాంకర్ రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీ,జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలుసిందే.
అయితే మొదట్లో యాంకర్ రష్మీ పై దారుణంగా ట్రోలింగ్స్ చేసేవారు.రష్మీ మాట్లాడే తెలుగు విపరీతంగా ట్రోలింగ్స్ చేసేవారు.
తెలుగు రాని వాళ్ళు కూడా యాంకరింగ్ చేస్తున్నారు అంటూ నెగిటివ్ కామెంట్ చేసేవారు.కానీ ఆ తర్వాత రష్మీ మంచితనం గురించి ఆమె చేసి మంచి పనుల గురించి తెలిసి ఆమెను తిట్టిన వారే మళ్లీ ఆమెను పొగిడారు.
ఇకపోతే రష్మి గౌతమ్ కి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారు మనందరికీ తెలిసిందే.ఇక సోషల్ మీడియాలో ఆమె చేసే పోస్టులకు విపరీతమైన స్పందన లభిస్తూ ఉంటుంది.
లక్షల్లో లైక్స్ వేలలో కామెంట్స్ వస్తూ ఉంటాయి.ఆమె మూగ జీవాల కోసం పాటు పడుతుండటం, వాటి సంరక్షణ కోసం తాపత్రయ పడుతుండటం చూసి అందరూ కనెక్ట్ అవుతుంటారు.
అయితే డబ్బు కోసం ఒకప్పుడు ఎలాంటి పాత్రలు చేయడానికి అయినా ముందుకు వచ్చిన రష్మీ డబ్బు అవసరం అని, డబ్బు కోసమే అలాంటి పాత్రలు చేశానంటూ అందరి ముందే ఒప్పేసుకుంది.

అయితే బుల్లితెరపై వచ్చే షోల్లోనూ ఒకప్పుడు రష్మీ తన అందాలను ప్రదర్శించేది.కానీ కొన్ని రోజులుగా వాటికి దూరంగా ఉంటూ వచ్చింది.నిండైన వస్త్రాలతోనే కనిపించేది.
కానీ తాజాగా రిలీజ్ చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో మాత్రం రష్మీ మళ్లీ అందరినీ ఆశ్చర్యపరిచింది.మోకాళ్ల పైకి గౌను ధరించింది.
పొట్టి గౌనులో ఇలా కనిపించేసరికి అందరూ ఆశ్చర్య పోతున్నారు.రష్మీ డ్రెస్ విషయంలో కొందరు నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు.







