కెరీర్ తొలినాళ్లలో విభిన్నమైన కథలతో వరుసగా విజయాలను సొంతం చేసుకున్న డైరెక్టర్లలో కృష్ణవంశీ కూడా ఒకరు.అయితే ఈ మధ్య కాలంలో కృష్ణవంశీకి అదృష్టం కలిసిరావడం లేదు.
ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోవడం లేదు.అయితే రంగమార్తాండ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని ఈ డైరెక్టర్ భావిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ తో రాఖీ సినిమాను తెరకెక్కించి ఆ సినిమాతో అబవ్ యావరేజ్ రిజల్ట్ ను అందుకున్న కృష్ణవంశీ మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ తో ఇప్పటివరకు సినిమాను తెరకెక్కించలేదనే సంగతి తెలిసిందే. పవన్, బాలయ్యలతో సినిమాలు చేయలేదు.
ఈ ముగ్గురు హీరోలతో ప్రాజెక్ట్ ల గురించి స్పందిస్తూ తాజాగా కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలయ్యతో ఒక సినిమా తెరకెక్కించాలని ప్రయత్నాలను కూడా మొదలుపెట్టానని ఆ సమయంలో బాలయ్యకు నచ్చినట్టుగా కొన్ని మార్పులు చేయడం జరిగిందని కృష్ణవంశీ పేర్కొన్నారు.
ఆ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించడానికి అమితాబ్ నో చెప్పారని ఆయన కామెంట్లు చేశారు.అమితాబ్ పాత్రలో మరో వ్యక్తిని ఊహించుకోలేక ఆ సినిమాను ఆపేశామని ఆయన వెల్లడించారు.

జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల కుదరలేదని ఆయన తెలిపారు.పవన్ ను చివరిసారిగా పదేళ్ల క్రితం చరణ్ పెళ్లిలో కలిశానని ఆ సమయంలో పవన్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నానని ఆ సినిమా మొదలై ఉంటే బాగుండేదని కృష్ణవంశీ అన్నారు.కృష్ణవంశీ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.జయాపజయాలతో సంబంధం లేకుండా కృష్ణవంశీ సినిమా ఆఫర్లను అందుకుంటున్నారు.







