ఏపీలోని అధికార పార్టీ వైసీపీ( YCP ) ఎంతో ప్రతిష్టాత్మకంగా సిద్ధం సభలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ నెల 10న మేదరమెట్ల పి.
గుడిపాడులో మరో సిద్ధం సభను ఏర్పాటు చేయనున్నారు.ఈ క్రమంలో సిద్ధం సభ( Siddham Meeting )కు సంబంధించిన పోస్టర్ మరియు సాంగ్ ను ఎంపీ విజయసాయిరెడ్డి విడుదల చేశారు.
అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి( YCP MP Vijayasai Reddy ) మాట్లాడుతూ సభలో కార్యకర్తలకు సీఎం జగన్( CM YS Jagan ) దివానిర్దేశం చేస్తారని చెప్పారు.ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తామని తెలిపారు.
అలాగే సభా వేదికగా మ్యానిఫెస్టోను విడుదల చేయబోతున్నామని వెల్లడించారు.







