YCP MP Vijayasai Reddy : ఈనెల 10న సిద్ధం సభా వేదికగా మ్యానిఫెస్టో విడుదల..: ఎంపీ విజయసాయిరెడ్డి

ఏపీలోని అధికార పార్టీ వైసీపీ( YCP ) ఎంతో ప్రతిష్టాత్మకంగా సిద్ధం సభలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ నెల 10న మేదరమెట్ల పి.గుడిపాడులో మరో సిద్ధం సభను ఏర్పాటు చేయనున్నారు.

ఈ క్రమంలో సిద్ధం సభ( Siddham Meeting )కు సంబంధించిన పోస్టర్ మరియు సాంగ్ ను ఎంపీ విజయసాయిరెడ్డి విడుదల చేశారు.

అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి( YCP MP Vijayasai Reddy ) మాట్లాడుతూ సభలో కార్యకర్తలకు సీఎం జగన్( CM YS Jagan ) దివానిర్దేశం చేస్తారని చెప్పారు.

ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తామని తెలిపారు.అలాగే సభా వేదికగా మ్యానిఫెస్టోను విడుదల చేయబోతున్నామని వెల్లడించారు.