మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కొడుకు ఇన్ని దొంగతనాలు చేశాడా..ఇదేమి పాడు బుద్ధి!

చిన్న పిల్లల దగ్గర నుండి ముసలోళ్ల వరకు ప్రతీ ఒక్కరు ఎంజాయ్ చేసేది కేవలం మ్యూజిక్ కి మాత్రమే.రోజు మొత్తం కస్టపడి పని చేసి వచ్చిన సగటు ఉద్యోగికి ఉపశమనం కలిగించేది కూడా సంగీతమే.

 Mani Sharma Son Sagar Mahathi Comments Viral On Social Media , Mani Sharma ,   S-TeluguStop.com

ఇక ఆ సంగీతం ని కంపోజ్ చేసే వాడు ఎంత గొప్ప వాడు అయ్యుంటాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఇండస్ట్రీ లో ఎన్నో వందల మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా, కేవలం కొంతమంది మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్ గా తరతరాలు చలామణి అవుతూ ఉంటారు.

ఆ కొంతమందిలో ఒకరే మెలోడీ బ్రహ్మ మణిశర్మ.ఈయన అందించే సంగీతం కోసం మన టాలీవుడ్ టాప్ హీరోలు క్యూలు కడుతారు.

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున , వెంకటేష్, మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ ఇలా ప్రతీ హీరో సినిమాకి పని చేసిన ఏకైక సంగీత దర్శకుడు మణిశర్మ.అతి తక్కువ సమయం లో కూడా అద్భుతమైన క్వాలిటీ మ్యూజిక్ అందించడం ఆయనకే చెందింది.

Telugu Bhola Shankar, Chiranjeevi, Kollywood, Mani Sharma, Sagar Mahathi, Tollyw

అందుకే ప్రస్తుతం టాలీవుడ్ లో థమన్ మరియు దేవిశ్రీ ప్రసాద్ మేనియా నడుస్తున్నప్పటికీ కూడా మణిశర్మ కి స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందించే ఛాన్స్ దక్కించుకుంటున్నాడు.రీసెంట్ గా ఆయన నుండి విడుదలైన బ్లాక్ బస్టర్ ఆల్బం ‘ఆచార్య‘.సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ పాటల పరంగా ఆల్బం పెద్ద హిట్టే.కేవలం ఈ సినిమాలోని పాటల వల్లే ఈ చిత్రానికి విడుదలకు ముందు భారీ స్థాయి అంచనాలు ఏర్పడ్డాయి.

రీసెంట్ గా ఆయన శాకుంతలం చిత్రానికి సంగీతం అందించాడు.ఇది ఇలా ఉండగా మణిశర్మ కొడుకు మహతి సాగర్( Sagar Mahathi ) కూడా టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఫుల్ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించి విడుదలకు సిద్ధం గా ఉన్న లేటెస్ట్ చిత్రం ‘భోళా శంకర్( Bhola Shankar )’ కి కూడా మహతి సాగర్ సంగీతం అందించాడు.నిన్న ఈ సినిమాలోని మొదటి పాటకి సంబంధించిన ప్రోమో ని విడుదల చేసారు, రేపు పూర్తి స్థాయి పాటని విడుదల చెయ్యనున్నారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Kollywood, Mani Sharma, Sagar Mahathi, Tollyw

ఇది ఇలా ఉండగా రీసెంట్ గా మహతి సాగర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన చేసిన కొన్ని చిలిపి పనుల గురించి చెప్పుకొచ్చాడు.ఆయన మాట్లాడుతూ ‘నాకు చిన్నప్పటి నుండి మొబైల్స్ అంటే పిచ్చి, నా దగ్గర చిన్నప్పటి నుండే భారీ కలెక్షన్ ఉండేది.మార్కెట్ లోకి ఏ కొత్త మొబైల్ వచ్చినా వెంటనే కొనేస్తూ ఉంటాను.మా నాన్న గారి క్రెడిట్ కార్డు ని దొంగతనం చేసి అలా ఎన్ని మొబైల్స్ కొన్నానో లెక్కే లేదు, క్రెడిట్ కార్డు బిల్స్ చూసిన తర్వాత నాన్న షాక్ కి గురి అయ్యేవాడు’ అంటూ మహతి సాగర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మహతి సాగర్ భోళా శంకర్( Bhola Shankar ) చిత్రానికి ముందు భీష్మ, చలో మరియు మాచెర్ల నియోజకవర్గం వంటి సినిమాలకు సంగీతం అందించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube