అంత్రాక్నోస్ తెగులు(Anthracnose) మామిడి చెట్టు లోని అన్ని భాగాలపై విపరీతంగా ప్రభావం చూపిస్తాయి.ఈ తెగులు సోకినప్పుడు చెట్ల అన్ని భాగాలపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి.
పిందెలు భారీ మొత్తంలో రాలిపోవడంతో పాటు మామిడి కాయ నాణ్యత కూడా దెబ్బతింటుంది.మామిడి పండ్లు(Mangoes) కాపు కాసే సమయంలో ఈ తెగులు పంటను ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి పంట కాపు కు వస్తున్న సందర్భంలో గమనించి నివారణ చర్యలు చేపట్టాలి.
చెట్టు నుండి పిందెలు కాయలు రాలినప్పుడు వాటిని కల్చేయాలి.చెట్టుపై గుబురు కొమ్మలు, ఎండిన కొమ్మలు ఉంటే వెంటనే వాటిని కత్తిరించి పడేయాలి.చెట్టు కు పూత పిందెలు వస్తున్న సమయంలో సమృద్ధిగా నీరు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి.పూత పిందెలను రాలకుండా అరికట్టడానికి 4.5 లీటర్ల నీటిలో ఒక మిల్లీ లీటర్ ఫ్లోనో ఫిక్స్ కలిపి రెండుసార్లు పంటకు పిచికారి చేయాలి.ఇలా చేస్తే తెగుళ్ల నుండి పంట సంరక్షించబడుతుంది.ఇక మామిడి చెట్లను గూడు పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి.చెట్లపై గుడ్లు పెట్టి ఆకుపచ్చ గోధుమ వర్ణపు లార్వాలు ఏర్పరుస్తాయి.
ఆకుల పత్ర హరితాన్ని తినేసి, పూత పై కూడా వీటి ప్రభావం ఉంటుంది.పంట పూత దశలో ఉన్నప్పుడు వీటిని గమనించి తగిన చర్యలు తీసుకోవాలి.ముందుగా చెట్లపై వీటి గూళ్లను గుర్తించి.
కర్రలతో కిందపడేలా చేసి మొత్తం కల్చేయాలి.వెంటనే పురుగు మందులతో పిచికారి చేయాలి.ఒక లీటర్ నీటిలో 1.5 గ్రాములు ఎసిఫేట్(Acephate) కలిపి చెట్టు ఆకులు, కొమ్మలు, పూత బాగా తడిసేలాగా పిచికారి చేయాలి.ఈ తెగుళ్లను సకాలంలో గుర్తించి అరికట్టగలిగితే ఆశించిన స్థాయిలో దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.మంచి ఆదాయం పొందవచ్చు.