సాధారణంగా హీరో హీరోయిన్లు కొంతకాలం పాటు సినిమాల్లో నటించి ఆపై బిజినెస్ లు స్టార్ట్ చేస్తుంటారు.కాజల్ అగర్వాల్, సమంత( Kajal Aggarwal, Samantha ) ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సైడ్ బిజినెస్ లు ఆల్రెడీ ప్రారంభించి లాభాలు పొందుతున్నారు.
హీరో హీరోయిన్లు మాత్రమే కాదు వారి చెల్లెలు, వారి భాగస్వాములు కూడా వ్యాపారాల్లో అడుగుపెడుతూ సక్సెస్ సాధిస్తున్నారు.తాజాగా మంచు విష్ణు భార్య విరానికా రెడ్డి( Viranika Reddy ) శారీల బిజినెస్ ప్రారంభించినట్టు వార్తలు వస్తున్నాయి.
మంచు విష్ణు ( Manchu Vishnu )2018 నుంచి ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు.ఇటీవల కాలంలో తీసిన మోసగాడు, జిన్నా సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
వాటితో బాగా డిసప్పాయింట్ అయిన మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప అనే ఒక డివోషనల్ మూవీ తీయడానికి సిద్ధమయ్యాడు.ఇందులో ప్రభాస్ కూడా నటిస్తుండడం విశేషం.ఈ క్రమంలోనే విష్ణు భార్య విరానికా చీరల వ్యాపారం ప్రారంభించిందనే ఓ కొత్త వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.ఈ బిజినెస్ లో మంచు వారి కోడలు సక్సెస్ అవుతుందో లేదో తెలియదు కానీ మోహన్ బాబు నుంచి మంచు లక్ష్మి ( Manchu Lakshmi )వరకు అందరూ కూడా ఆమె సక్సెస్ కావాలని బాగా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే విరానికా విక్రయిస్తున్న చీరలు( sarees ) సామాన్యులు కొనుక్కోలేనంత అధిక ధరల్లో ఉంటాయట.సినీ సర్కిల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం, ఈ ఒక్కో చీర ఖరీదు కనీసం రూ.20 లక్షలు ఉంటుందట.సాధారణంగా పెళ్లిళ్లు ఇతర ఫంక్షన్ ల కోసం సెలబ్రిటీలతో పాటు ధనవంతులు లక్షల్లో డబ్బు పెట్టి చీరలు కొనుగోలు చేస్తుంటారు.
అలాంటి వారికి చీరలు అమ్ముతూ లక్షలు సంపాదించాలనే లక్ష్యంతో విరానికా ఈ బిజినెస్ పెట్టినట్లు తెలుస్తోంది.ఈ మంచు వారి కోడలు అమ్మే చీరలు డిజైన్ చేయడానికి ఏకంగా 75 రోజులు సమయం పడుతుందట.
చేతితో డిజైన్ చేసే ఈ ఎంబ్రాయిడరీ సిల్క్ శారీలు చాలా అట్రాక్టివ్ గా ఉంటాయని టాక్.

విరానికా చీరల వ్యాపారానికి “విరానికా బ్రైడల్ కలెక్షన్”( Viranika Bridal Collection ) అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది.ఈ కంపెనీ నేమ్ ప్రకారం ఆమె కేవలం వధువులకు అవసరమయ్యే డ్రెస్సెస్ మాత్రమే అమ్ముతుందని అర్థం చేసుకోవచ్చు.అయితే హీరోయిన్లు కూడా ఈ ముద్దుగుమ్మ వద్ద చీరలు కొనడం ప్రారంభించారని అంటున్నారు.
సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇప్పటికే విరానికా బ్రైడల్ కలెక్షన్ నుంచి ఒక చీర తెప్పించుకుని కట్టుకుందని, దీనిని తయారు చేయడానికి ఏకంగా 40 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టిందని కొందరు అంటున్నారు.సినిమా ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి విరానికా తన వ్యాపారంలో ఈజీగా సక్సెస్ అవ్వచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.







