టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ తరఫున తాజాగా కొంత మంది సెలబ్రిటీలు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే.గత కొద్దీ రోజులుగా ఏపీ లో టికెట్ రేట్ల వ్యవహారం గురించి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా టికెట్ రేట్ల అంశాలకు ఎండ్ కార్డు వేసారు.త్వరలోనే సానుకూలమైన జీవో రానుంది అని తెలిపారు.
అంతేకాకుండా రోజుకి ఐదు షోల అనుమతి కూడా లభించింది.చిన్న సినిమాల మనుగడకోసం కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, హీరో ప్రభాస్, మహేష్ బాబు పలువురు ప్రముఖులు జగన్ తో భేటీ అయ్యారు.
కానీ అక్కడ మంచు ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్ కానీ, మంచు విష్ణు కానీ రాకపోవడంతో సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ పై విపరీతమైన ట్రోలింగ్స్ చేస్తున్నారు.
మా ఎన్నికల సమయంలో, మంచు విష్ణు, మోహన్ బాబు చేసిన ఓవరాక్షన్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతున్నాయి.మా ప్రెసిడెంట్ ఎక్కడ ఉన్నాడు.? మంచు విష్ణు ని పిలవ లేదా? ఏం చేస్తున్నాడు? ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు.ఇక చిరంజీవి, వైయస్ జగన్ భేటీపై కూడా మంచు విష్ణు కౌంటర్లు వేశాడు.
అది పర్సనల్ మీటింగ్, దానికి సినీపరిశ్రమకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా కామెంట్ చేశాడు.ఇదే అంశంపై మోహన్ బాబు కూడా లేఖ రాశారు.
అందరూ కలిసి మాట్లాడుకుని ఆ తర్వాత ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.కానీ జగన్ భేటీకి మంచు విష్ణు కానీ, తండ్రి మోహన్ బాబు కానీ రాలేదు.ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలకు మంచు మనోజ్ చేసిన ట్వీట్ మరింత ఆజ్యం పోసినట్లయింది.
మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి లు జగన్ తో కలిసి ఉన్న ఫోటోపై మంచు మనోజ్ ట్వీట్ చేశాడు.కన్నుల పండుగగా ఉందన్నట్టుగా కామెంట్ పెట్టాడు.దీంతో నెటిజన్లు మనోజ్ ట్వీట్ మీద సెటైర్లు వేస్తున్నారు.