మళ్లీ మా ఎన్నికల్లో పోటీ చెయ్యను.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ హీరో మంచు విష్ణు గురించి మనందరికీ తెలిసిందే.ఒకప్పుడు హీరోగా నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు విష్ణు ఆ తర్వాత సినిమాలకు కొద్దిగా కాలం పాటు దూరం అయిన విషయం తెలిసిందే.

 Manchu Vishnu Comments Viral On Jinna Movie Promotions , Manchu Vishnu , Tollywo-TeluguStop.com

ఆ తర్వాత మంచు విష్ణు పేరు అంతగా వినపడలేదు.ఆ తర్వాత మళ్లీ మా ఎన్నికల సమయంలో మంచు విష్ణు పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో మారుమోగిపోయింది.

మా ఎన్నికలలో మంచు విష్ణు మా అధ్యక్షుడిగా గెలిచిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఇటీవలే మంచి విష్ణు మళ్ళీ నటుడిగా తన సినీ ప్రస్తావని మొదలుపెట్టారు.

 Manchu Vishnu Comments Viral On Jinna Movie Promotions , Manchu Vishnu , Tollywo-TeluguStop.com

ఈ క్రమంలోనే మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం జిన్నా.

ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ ఇద్దరు హీరోయిన్లుగా నటించారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రచారంలో పాల్గొన్న మంచి విష్ణు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా మంచువిష్ణు మాట్లాడుతూ.నటుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేందుకు గట్టిగానే శ్రమిస్తాను కానీ ఇకపై మా సహా ఎటువంటి ఎన్నికలలో పోటీ చేయను అని తెలిపారు మంచి విష్ణు.

సదరు యాంకర్ అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చారు మంచు విష్ణు.

అక్టోబర్ 5న మరొక రెండు సినిమాలు కూడా విడుదల కానున్నాయి కదా మరి జిన్నా సినిమా ప్రత్యేకత ఏమిటి అని అడగగా.ఆ ప్రశ్నపై స్పందించిన మంచి.జిన్నా సినిమా కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించాలి అనుకున్నాము కానీ మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను.

ముందుగా అనుకున్న విధంగానే జిన్నా సినిమాను అక్టోబర్ 5న విడుదల కావడం లేదు.ఈ సినిమాను అక్టోబర్ 21వ తేదీన పేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. కానీ అక్టోబర్ 5న ట్రైలర్ను విడుదల చేస్తున్నాం అని తెలిపారు మంచు విష్ణు.అయితే చాలా కాలం తర్వాత జిన్నా సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న మంచు విష్ణు ఈ సినిమాతో ఏ మేరకు సక్సెస్ ను అందుకుంటారు చూడాలి మరి.ఇది ఏ ఛానల్ సినిమా అని ప్రశ్నించగా ఇది చంద్రముఖి లాంటి హారర్ కామెడీ సినిమా అని తెలిపారు మంచి విష్ణు.అలాగే ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే భారీగా కలెక్షన్స్ సాధిస్తుంది అని నేను భావిస్తున్నాను అని చెప్పుకొచ్చారు మంచు విష్ణు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube