ప్రణయ్ పరువు హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృస్టించిన విషయం తెల్సిందే.అమృతను ప్రేమించి, పెళ్లి చేసుకున్నందుకు ప్రణయ్‌ని అమృత తండ్రి దారుణంగా హత్య చేయించాడు.
సంచలనం రేపిన ఈ కేసులో ప్రతి ఒక్కరు కూడా అమృత తండ్రి మారుతిరావుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు.

ఇలాంటి సమయంలో కొందరు మాత్రం సోషల్ మీడియాలో ప్రణయ్ హత్యను సమర్ధిస్తున్నారు.పరువు కోసం, స్టేటస్ కోసం ఆయన చేసిన పని తప్పు కాదని, 20 ఏళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని ఎవరైనా తీసుకు వెళ్తే అంతే కోపం వస్తుందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ప్రణయ్ హత్యను సమర్థిస్తున్న వారిపై మంచు మనోజ్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు.
సోషల్ మీడియాలో తాను కొన్ని కామెంట్స్ చూశాను.ఆ కామెంట్స్ చూస్తే అత్యంత హీనంగా అనిపిస్తుంది.
ప్రణయ్ హత్యను సమర్థించిన వారు ఉన్న సమాజంలో తాను ఉన్నందుకు సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్ చేశాడు.అసలు అలా మాట్లాడి కుక్కలను రోడ్డు మీద చెప్పుతో కొట్టినా తప్పు లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా ప్రణయ్ హత్యను సమర్ధిస్తూ కామెంట్స్ చేస్తున్న వారి పేర్లను పోలీసులు నోట్ చేసుకోవాలని, వారు భవిష్యత్తులో ఇలాంటి పనులు చేసే అవకాశం ఉందని, ముందు జాగ్రత్తగా వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు మంచు మనోజ్ సూచించాడు.ఒక మనిషి చనిపోయినప్పుడు కనీస ధర్మంగా వారి పట్ల సానుభూతిని వ్యక్తం చేయాలి.కాని ఆ నీచులు మాత్రం అత్యంత దారుణంగా కుక్కల మాదిరిగా ప్రణయ్ హత్యను సమర్ధిస్తున్నారు అంటూ మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.