Manchu Manoj : ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతున్న మంచు మనోజ్.. ట్వీట్ వైరల్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా మారుమోగుతున్న పేర్లలో మంచు ఫ్యామిలీ కూడా ఒకటి.తరచూ ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో నిలిచే మంచి ఫ్యామిలీ ఈసారి గొడవలతో ఏకంగా వీదికెక్కింది.

 Manchu Manoj Enjoying This Sunday With His Friends-TeluguStop.com

మంచు మనోజ్( Manchu manoj ) పెళ్లి తరువాత మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.అయితే ఇందులో మంచు విష్ణు ఎక్కువగా హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు.

మొన్నటికి మొన్న మంచు మనోజ్ పెళ్లిలో విష్ణు అతిథిగా ప్రవర్తించడంతో మండిపడిన అభిమానులు తాజాగా మంచి విష్ణు మంచు మనోజ్ ని కొట్టడానికి రావడంతో అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.

ఈ వీడియో పై కూడా అభిమానులు మండిపడుతున్నారు.ఆ వీడియోని చూసిన నెటిజెన్స్ మంచు విష్ణు ఏకిపారేస్తున్నారు.గతంలో ఎంతో క్లోజ్ గా చనువుగా ఉన్న మంచు సోదరులు ఇద్దరు ఇలా మనస్పర్ధలు రావడం పోట్లాడుకోవడం అన్నది మంచు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మంచు విష్ణు( Mohan Babu ) తన అనుచరులు బంధువులపై దాడికి దిగుతున్నాడు అంటూ మనోజ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం మనందరికీ తెలిసిందే.ఆ ఘటనపై స్పందించిన మంచు ఫ్యామిలీ ప్రతి ఒక్క ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న వివాదాల లాంటివే అంటూ వివరణ ఇచ్చుకుంది.

ఇక ఆ గొడవపై మోహన్ బాబు, కుటుంబ పెద్దలు ఇన్వాల్వ్ అయి అన్నదమ్ముల వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే పరిస్థితులు చెక్కబడినట్టు ఉన్నాయి.అందుకే మంచు మనోజ్ ఎంచక్కా స్నేహితులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేశారు.

తాజాగా మంచు మనోజ్ తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో ఫుల్ బిందాస్ గా గడిపాడు.ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపాడు.మంచు మనోజ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో మెగా డైరెక్టర్ బాబీ కూడా ఉన్నారు.

నా డార్లింగ్ బ్రదర్స్ డైరెక్టర్ బాబీ( Boby ), డైరెక్టర్ వంశి, కిరణ్ గిరజాల లతో ఈ ఆదివారం అద్భుతంగా గడిచింది.మన సంభాషణ ఎంతోబావుంది.నా కోసం మీ ఇళ్ల నుంచి మంచి భోజనం తెచ్చినందుకు థాంక్యూ.ఇలాంటి సరదా సంఘటనలు జరుగుతూనే ఉండాలి అంటూ మనోజ్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే నిన్న మొన్నటి వరకు ఆ వివాదాలతో సోషల్ మీడియాలో నిలిచిన మంచు మనోజ్ తాజాగా ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

కాగా మంచు మనోజ్ ఇటీవలే భూమా మౌనిక రెడ్డిని రెండవ వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.అప్పటినుంచి తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉన్నాడు మంచు మనోజ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube