టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అయితే కథ ఏడాది ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే.
అయితే ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డారు మహేష్ బాబు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని అభిమానులు ఎదురు చూడడంతో పాటు ఈ సినిమా అప్డేట్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా చిత్ర బృందం మహేష్ అభిమానులకు ఒక చక్కటి శుభవార్తను తెలిపింది.
శుభవార్తను తెలిపినట్టే తెలిపి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.శుభవార్త ఏంటి?షాక్ ఏంటి?అనుకుంటున్నారా! వివరాల్లోకి వెళితే.మహేష్ బాబు సినిమాలో వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

2024, జనవరి 13న మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విడుదల కానుంది అంటూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.మహేష్ బాబు లుక్కు సంబంధించిన ఫోటోను కూడా విడుదల చేసింది.ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మరోవైపు ఆర్సీ15( RC15 ) సినిమాతో రామ్ చరణ్( Ram charan ) సంక్రాంతి బడిలో ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పుడు సడన్గా అదే బలిలోకి మహేష్ బాబు వచ్చి కూడా నిలబడ్డాడు.

దీంతో ఒకేసారి రామ్ చరణ్, మహేష్ బాబు సినిమాలు విడుదల కానున్నాయి.రెండు కూడా భారీ ప్రాజెక్టులే అని చెప్పవచ్చు.ఇప్పటివరకు ఒక ఎత్తు అయితే మరో ఎత్తు కూడా ఉందండోయ్.
అదే ప్రాజెక్ట్ కె.ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్టు కే సినిమా సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే.దాంతో సంక్రాంతి బరిలో నుంచి ఆర్సీ15 సినిమా తప్పుకోనుంది అంటూ వార్తలు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఆర్సీ15 సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.ఈ విషయంపై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.







