తారక రత్న చేసిన తప్పే మంచు మనోజ్ చేస్తున్నాడు.. ముందు ముందు ఏం జరగనుంది ?

మంచు మనోజ్.భూమా మౌనిక రెడ్డి తో వివాహానికి ముందు మరియు తర్వాత అనేక వివాదాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు.

 Manchu Manoj Doing Mistakes Like Taraka Rathna , Manchu Manoj, Taraka Rathna, Bh-TeluguStop.com

చాలా రోజులుగా మౌనిక రెడ్డితో వివాహం గురించి సందిగ్గం నెలకొన్న తరుణంలో ఇటీవల ఘనంగా అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.అయితే గత కొన్ని నెలలుగా కుటుంబంలో వీరి వివాహం గురించి గొడవలు జరుగుతున్నా అనే విషయం చాలా రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

మంచు మనోజ్ మౌనికని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడం, అది అతడి కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది.కానీ వీరిద్దరూ గత ఆరు నెలలుగా సహజీవనం చేస్తున్నాడు అనే విషయం ప్రస్తుతం బయటకు వస్తోంది.

Telugu Akhila Reddy, Bhumamaunika, Manchu, Manchu Manoj, Taraka Rathna, Tollywoo

అయితే మౌనిక మరియు మంచు మనోజ్ ఇద్దరికి కూడా ఇది రెండో వివాహమే.ఇదివరకే పెళ్లి కాగా ఈ ఇద్దరు విడాకులు తీసుకొని సహజీవనం చేయడం మొదలుపెట్టారు.ఇక మౌనిక రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో మంచు మనోజ్ కి కష్టాలు కూడా మొదలయ్యాయి అని చెప్పుకోవచ్చు.ఎందుకంటే సినిమాలు ఆగిపోతున్నాయి.ఇప్పటికే చాలా రోజులుగా అతని కెరియర్ ముందుకు వెళ్లడం లేదు.ఇక మౌనిక రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో మనోజ్ కి కుటుంబం నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ దొరకడం లేదు.

తాను నటించే సినిమాలు కూడా ముందుకు వెళ్లేలా కనిపించడం లేదు.అందుకే సినిమా రకంగా మంచు మనోజ్ కెరియర్ ప్రశ్నార్థకంగా మిగిలే పరిస్థితి కనిపిస్తోంది.

మొదట్లో రాజకీయాల్లోకి రావాలనుకున్న మంచు మనోజ్ ఇప్పుడు ఆ ఆలోచన నుంచి కూడా విరమించుకున్నట్టు తెలుస్తోంది.

Telugu Akhila Reddy, Bhumamaunika, Manchu, Manchu Manoj, Taraka Rathna, Tollywoo

ఇలా కుటుంబానికి ఇష్టం లేని వివాహం చేసుకోవడం వల్ల నందమూరి తారకరత్న కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు.సినిమాలు పోయి, కెరియర్ కోల్పోయి, కుటుంబానికి దూరమై డిప్రెషన్ లోకి వెళ్లిపోయి అతి చిన్న వయసులోనే గుండెపోటుతో తారకరత్న కన్నుమూశాడు.కానీ మంచు మనోజ్ కూడా ఇలా కుటుంబానికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు అలాగే కెరియర్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు మరి ఇది ముందు ముందు ఇలాగే జరిగితే మరిన్ని సమస్యల్లో పడే అవకాశం ఉంది.

అందుకే మంచు మనోజ్ జీవితం వ్యక్తిగతంగా బాగుండాలని మంచు అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube