వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నా కూడా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూనే ఉంటాడు.సాదారణంగా ఏదైనా చర్చ కార్యక్రమంలో పాల్గొన్నా కూడా అతడు వివాదాస్పద అంశంను మాట్లాడుతూ ఉంటాడు.
ప్రస్తుతం టీవీ చర్చ కార్యక్రమంలో మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది సెలబ్రెటీలు సోషల్ మీడియా లైవ్‌కు వస్తున్నారు.మంచు లక్ష్మి కూడా నేడు సోషల్ మీడియా లైవ్‌కు రెడీ అయ్యింది.
భవిష్యత్తులో సినిమా ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటే బాగుంటుంది, రావాల్సిన మార్పులు ఏంటీ, చేయాల్సిన పనులు ఏంటీ అనే విషయాలపై చర్చించేందుకు నేడు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి మంచు లక్ష్మి రాబోతుంది.తనతో పాటు పలువురు టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా పాల్గొంటారంటూ చెప్పుకొచ్చింది.
ఈ లైవ్‌కు రామ్ గోపాల్ వర్మ రాబోతున్నట్లుగా కూడా మంచు లక్ష్మి పేర్కొంది.

మంచు లక్ష్మి ఆయన్ను పిలవడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు.మీరు ఎంచుకున్న టాప్ చాలా ఉపయోగదాయకమైనది.సినిమాల్లోకి రావాలనుకుంటున్న వారికి ఉపయగదాయకంగా ఉంటుందని భావిస్తున్నాము.
అలాంటి టాపిక్ మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆయన ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు.ఆయన వస్తే లైవ్‌లో రచ్చ ఎక్కువగా ఉంటుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.