తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు (Mohan Babu) వారసురాలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా నిర్మాతగా, నటిగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) హైదరాబాద్ నుంచి ముంబై షిఫ్ట్ అయ్యారని తెలుస్తోంది.మోహన్ బాబు వారసురాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మంచు లక్ష్మి తెలుగు సినిమాలలో ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రలలో నటించి మెప్పించారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఉన్నఫలంగా ముంబై( Mumbai ) షిఫ్ట్ అవడంతో ప్రతి ఒక్కరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.అయినా ఉన్నఫలంగా ఈమె ముంబై వెళ్లడానికి కారణం ఏంటి కొంపదీసి బాలీవుడ్ సినిమాలలో నటించబోతున్నారా అంటూ కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మంచు లక్ష్మీ ముంబై వెళ్లడం గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ నేను ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రలలో నటించాను అయితే తన పరిధిని మరి కాస్త విస్తరించాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చానని తాను సినిమాలు అలాగే వెబ్ సిరీస్లలో నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు.ఆడిషన్ కోసం( Auditions ) నన్ను కొన్ని ఆఫీసులకు రమ్మంటున్నారు.తెలుగు చిత్ర పరిశ్రమకు నేను స్టార్ కిడ్ కానీ బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు( Bollywood ) కాదు ఇక్కడ నేను సరికొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నాను అంటూ ఈ సందర్భంగా మంచు లక్ష్మి ముంబై వెళ్లడం వెనుక గల కారణాన్ని తెలియజేశారు.

నేను ముంబై (Mumbai) కాకుండా లాస్ ఏంజెల్ వెళ్ళిపోదామని అనుకున్నాను.ఈ విషయం అమ్మకు చెబితే అమ్మ భయపడి వద్దు అని చెప్పేశారు.అమ్మ భయపడటంతో కనీసం ముంబై వెళ్తాను అని చెప్పగా అమ్మ సరేనని ఒప్పుకుంది కానీ నాన్న మాత్రం ముంబై ఎందుకు అక్కడ పెద్ద మాఫియా ఉంటుంది అంటూ భయపడ్డారు.
ఏ తండ్రి అయినా కూడా ఇంటి నుంచి తన కూతురు వెళ్ళిపోతుంది అంటే ఇలాగే బాధపడతారు.తన తండ్రి కూడా అలాగే బాధపడ్డారు అంటూ మంచు లక్ష్మి తెలియజేశారు.
అయితే ముంబై వెళ్ళినటువంటి ఈమె అక్కడ కూడా తన టాలెంట్ పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.ఇలా ముంబై షిప్ అయినటువంటి మంచు లక్ష్మి బాంద్రాలోని ఒక అపార్ట్మెంట్ తీసుకొని అక్కడ స్థిరపడ్డారని తెలుస్తుంది.
ఇలా ముంబై వెళ్లిన లక్ష్మీ తన స్నేహితులందరికీ కూడా ఘనంగ పార్టీ ఇచ్చారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె అవకాశాలను అందుకొని అక్కడ స్టార్ సక్సెస్ అందుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.







