మంచు కుటుంబంలో( Manchu Family ) గత కొద్ది రోజులుగా గొడవలు చోటు చేసుకుంటున్న విషయం మనకు తెలిసిందే.మోహన్ బాబు( Mohan Babu ) విష్ణు( Vishnu ) ఒకవైపు ఉండగా వీరిద్దరితోను మనోజ్ కు విభేదాలు రావడంతో తరచూ ఈ కుటుంబంలో జరిగే గొడవలు సంచలనంగా మారాయి.
గత రెండు రోజుల క్రితం వరకు మనోజ్( Manoj ) ఏకంగా మోహన్ బాబు ఇంటి ముందు నిరసనలు కూడా తెలియజేశారు.అయితే తను చేసే ఈ గొడవలు ఆస్తి కోసం కాదని యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయం కోసమే పోరాటం చేస్తున్నాను అంటూ మంచు మనోజ్ గొడవలు గురించి మీడియా సమావేశాలలో సంచలన విషయాలను బయటపెట్టారు.

ఇదిలా ఉండగా తాజాగా మంచు లక్ష్మి( Manchu Lakshmi ) తన తమ్ముడు మనోజ్ ను చూడగానే ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.తాజాగా ఆమె ‘టీచ్ ఫర్ ఛేంజ్’ వార్షిక ఫండ్‌రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ ఈవెంట్‌లో కూతురితో కలిసి ర్యాంప్ వాక్ చేసింది.

ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా మంచు లక్ష్మి వేదికపై ఉన్న సమయంలోనే తన తమ్ముడు మంచు మనోజ్ వెనుక నుంచి వెళ్లి తనని పలకరించాడు ఇలా తన తమ్ముడిని ఒక్కసారి చూడటంతో తాను ఎక్కడ ఉన్నాను అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఒక్కసారిగా స్టేజ్ పై కుప్పకూలి తమ్ముడిని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇక మనోజ్ సైతం తన అక్కను ఓదారుస్తూ కనిపించారు అనంతరం మనోజ్ భార్య భూమా మౌనిక సైతం మంచు లక్ష్మిని ఓదారుస్తూ కనిపించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అయితే మంచు కుటుంబంలో గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నప్పటికీ ఈ గొడవల గురించి మంచు లక్ష్మి ఎక్కడా కూడా స్పందించలేదు స్పందించడానికి కూడా ఈమె ఇష్టపడలేదని చెప్పాలి.