పెళ్లి చేసుకోబోతున్న మనసంతా నువ్వే సినిమా చైల్డ్ ఆర్టిస్ట్!

నటి సుహాని కలిత పేరు చెప్పగానే చాలా మంది గుర్తుపట్టక పోవచ్చు కానీ తూనీగ తూనీగ పాటలో అలరించిన చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని కలిత అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు.చైల్డ్ ఆర్టిస్ట్ గానే కాకుండా నటిగా అదే విధంగా హీరోయిన్ గా మెప్పించిన ఈమె తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.

 Manasantha Nuvve Child Artist Suhani Kalita Engagement, Manasantha Nuvve, Child-TeluguStop.com

అయితే ఈమె మనసంతా నువ్వే సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా తూనీగా తూనీగా పాట ఆమె కెరిర్ కు బాగా ప్లస్ అయింది అని చెప్పవచ్చు.నటిగా హీరోయిన్ గా మెప్పించిన ఈమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది.

సంగీతకారుడు,మోటివేషనల్ స్పీకర్ అయిన విభర్‌ హసీజాను పెళ్లి చేసుకోబోతోంది.

ఈ మేరకు ఇటీవలే అతడితో నిశ్చితార్థం సైతం జరుపుకుంది.

ఇక ప్రస్తుతం నిశ్చితార్థం కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.ఆ ఫోటోలను చూసిన అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇకపోతే మొదట బాల రామాయణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయయం అయిన సుహాని కలిత ఆ తరువాత గణేష్‌, ప్రేమంటే ఇదేరా, మనసంతా నువ్వే, ఎలా చెప్పను లాంటి సినిమాలలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించి అలరించింది.

Telugu Childartist, Tollywood-Movie

అదే సమయంలోనే తెలుగుతో పాటు తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో వరుస అవకాశాలు రావడంతో అక్కడ కూడా సినిమాలు చేసి నటిగా మంచిది గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత పలు కంపెనీల యాడ్స్‌లో కూడా నటించి మెరిసింది.2008లో సవాల్‌ సినిమాతో హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.కానీ కథానాయికగా తనకు పెద్ద గుర్తింపు రాలేదు.ఆమె తెలుగులో చివరగా 2010లో స్నేహగీతం సినిమాలో కనిపించింది.ఆ తరువాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికి సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టీవ్ గా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube