హెల్త్ విషయంలో భౌతికంగా బాగుంటే చాలు అని చాలా మంది అపోహ పడుతుంటారు.కానీ, ఫిజికల్ హెల్త్‌తో పాటు మెంటల్ హెల్దీనెస్ కూడా మస్ట్ అన్న సంగతి ప్రతీ ఒక్కరు గుర్తెరగాలని నిపుణులు వివరిస్తున్నారు.
మానసికంగా ఆరోగ్యంగా లేకుంటే చాలా సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు.ఈ క్రమంలో ప్రతీ ఒక్కరు భౌతిక, మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
కాగా, మనం ఇప్పుడు తెలుసుబోయే ఘటనలో ఓ వ్యక్తి మానసిక ఆరోగ్యం సరగి లేకపోవడంతో ప్రాణాలు తీసుకున్నాడు.అసలేం జరిగిందంటే.
సిద్దిపే జిల్లా కొండపాక ఎర్రవెల్లి గోపాల్ కొన్నేళ్ల కిందటే బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చాడు.అతడి తమ్ముడు రవి కూడా హైదరాబాద్‌కు వచ్చాడు.గోపాల్ కవాడిగూడలోని తాళ్లబస్తీలో ఉంటుండగా, అతడి వద్దకు తమ్ముడు రవి వచ్చాడు.అయితే రెండేళ్ల కిందట తమ్ముడు రవికి మ్యారేజ్ కాగా, రవి తన ఫ్యామిలీతో రామంతాపూర్‌లో ఉంటున్నాడు.
ఇక ఉన్న తమ్ముడు వేరే చోటకు వెళ్లడంతో గోపాల్ ఒంటరివాడయ్యాడు.అతడి ఆలనా పాలనా పట్ల శ్రద్ధ వహించేవారు కరువయ్యారు.
ఈ క్రమంలో గోపాల్ మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది.ఇటీవల అన్న గోపాల్‌ను చూసేందుకు తమ్ముడు రవి ఇంటికొచ్చాడు.
ఆ సమయంలో గోపాల్ యోగా చేస్తూ బాగానే ఉన్నాడు.అలా యోగా పూర్తయ్యాక అన్నదమ్ములు మాట్లాడుకున్నారు.
తమ్ముడు సాయంత్రం తన ఇంటికి వెళ్లగా, గోపాల్ ఆ రోజు రాత్రి బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.రోజంతా రూమ్ ఓపెన్ చేయకుండా ఉండటంతో ఇరుగు పొరుగు వారు ఇంటిలోనికి వెళ్లి చూశారు.
డోర్ కొట్టినా సమాధానం రాకపోవడంతో అనుమానంతో గది తలుపును తెరిచారు.

ఇక అప్పటికే రూంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణం కోల్పోయి ఉన్నాడు.సమాచారం తమ్ముడు రవికి ఇవ్వగా కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కుటుంబీకుల నుంచి వివరాలు సేకరించారు.ఘటనా స్థలంలో దొరికిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
గోపాల్ రాసిన సూసైడ్ నోట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.తనను ఆంజనేయ స్వామి పిలుస్తున్నాడని, అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నానని గోపాల్ ఆత్మహత్య లేఖలో రాశాడు.
తమ్ముడు రవి పెళ్లి అయినప్పటి నుంచి గోపాల్ దిగులుగా ఉంటున్నాడని, తనకు పెళ్లి కావడం లేదని గోపాల్ బాధపడుతున్నాడని ఇరుగు పొరుగు వారు తెలిపారు.ఈ క్రమంలోనే తనకు వివాహం కావట్లేదనే మనస్తాపంతో గోపాల్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.