ఏంటి నిజామా ప్రేమ ప్రమాదకరమా? అలా ఎలా అంటారు మీరు అని మీకు అనిపించింది కదా! అనిపించడంలో ఎలాంటి సందేహం లేదు.ఎందుకంటే ప్రేమ ఎంతో మధురంగా ఉంటుందని అందరూ అంటుంటారు కాబట్టి.
కానీ ప్రేమించిన వారు మనకు దగ్గరైతే ప్రేమ నిజంగానే మధురంగా ఉంటుంది.అదే వారు దూరం అవుతే ప్రేమే శాపం అవుతుంది.
ఇంకా ప్రేమించిన వారికి ప్రేమను చెప్పే సమయంలో అయితే మనం ఎన్ని కష్టాలు పడుతాం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇంకా అలానే ఓ యువకుడు తన ప్రేయసికి తన ప్రేమ గురించి చెప్పాలి అనుకున్నాడు.
చిన్న బడ్జెట్ లోనే రూమ్ ని అంత కొవ్వొత్తుల తో అందంగా తయారు చేశాడు.
తన ప్రేయసిని ఇంటికి తీసుకురావాలని వెళ్ళాడు.
తిరిగి వచ్చేసరికి ఆ ఇంట్లో నుండి వచ్చే మంటలను ఆపడానికి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు ఫైర్ ఇంజిన్లు కష్టపడుతున్నాయి.అది చూసి షాక్ అయినా ఆ యువకుడు ఇంకా అక్కడే తనకు ప్రేపోజ్ చేశాడు.
ఇంత జరిగాక ఆమె ఎస్ చెప్పకుండా ఉంటుందా? ఎస్ చెప్పేసింది.అతను ప్రేపోజ్ చేసే సమయంలో ఫైర్ ఇంజిన్ సిబ్బంది ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా అవి వైరల్ అయ్యాయి.
దీనిపై స్పందించిన కొందరు నెటిజన్లు ”ప్రేమ ఎంత ప్రమాదకరం” అంటూ కామెంట్లు చేశారు.