కొంతమంది విన్యాసాలు చేస్తూ ఉంటారు.పాపులర్ అవ్వడం కోసమో.
లేదా మరో కారణం వల్లనో అనేక ప్రమాదకర విన్యాసాలు( Dangerous Stunts ) చేస్తూ ఉంటారు.వీరి విన్యాసాలు అందరికీ భయాన్ని కల్గిస్తున్నాయి.
ప్రాణాలకు ముప్పు తెచ్చే విన్యాసాలు, స్టంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.
తాజాగా అలాంటి ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోలో ఒక వ్యక్తి ఏకంగా చాలా ఎత్తైన అపార్ట్‌మెంట్ పైనుంచి దూకేశాడు.
ఈ వీడియోలో ఒక వ్యక్తి ఒక ఎత్తైన అపార్ట్‌మెంట్ లోని( Apartment ) ఒక ఇంటి బాల్కనీ నుంచి ఒక్కసారిగా క్రిందకు దూకేశాడు.దీనికి ఎదురుగా ఉన్న భవనంలో నివసిస్తున్న ఒక వ్యక్తి దీనిని గమనించాడు.దీంతో ఈ భయంకర దృశ్యాన్ని తన ఫోన్ కెమెరాల్లో అతడు బంధించాడు.ఈ వీడియోలో ఒక వ్యక్తి హడావుడిగా బాల్కనీ దగ్గరకు వచ్చాడు.బాల్కనీ నుంచి కిందకు తొంగిచూశాడు.ఆ తర్వాత బాల్కనీలోని గోడను పట్టుకుని తర్వాత ఒక్కసారి చేయి వదిలేశాడు.
దీంతో అక్కడ నుంచి భవనం కింద పడిపోయాడు.ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వ్యక్తి ఇది గమనించి వీడియో తీశాడు.
అతడు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో( Social Media ) చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోలో ఉన్న వ్యక్తి అసలు అలా ఎందుకు చేశాడనేది తెలియరాలేదు.అపార్ట్‌మెంట్ నుంచి కిందకు దూకిన వ్యక్తి చనిపోయాడా? లేదా? అనే వివరాలు కూడా తెలియలేదు.కానీ అంత ఎత్తు నుంచి దూకడం చూస్తుంటే చనిపోయి ఉంటాడని కొంతమంది చెబుతుండగా.
మరికొందరు గాయపడి ఉంటాడని అంటున్నారు.ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు బయటకు రాలేదు.
కానీ ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఈ వీడియోను ఇప్పటివరకు 28 లక్షల మంది వీక్షించగా.20 వేల మంది లైక్ కొట్టారు.