ప్రతి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో హత్య కేసులు, రేప్ కేసులు ఇంకా దొంగతనాల వంటి చిల్లర కేసులు చూస్తూనే ఉంటాం.వాటికి సంబంధించిన వార్తలు పెద్దగా మీడియాలో రావు.
కాని అతి చిన్న నేరాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి.అవి కొన్ని సార్లు చాలా సిల్లీగా అనిపించినా ఆసక్తిని కలిగిస్తాయి.
తాజాగా చైనాలో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది.ఒక కుక్క పిల్ల విషయంలో దాని యజమాని వ్యవహరించిన తీరు ప్రస్తుతం వైరల్ అయ్యింది.
అతడు తన ముద్దు కుక్క పిల్లకు పేరు పెట్టడంతో అది కాస్త చర్చనీయాంశం అయ్యింది.అయితే అతడు కుక్క పిల్లలకు పేరు పెడితే సమస్య లేదు, కాని అతడు పెట్టిన పేరుతోనే అసలు సమస్య వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… 30 ఏళ్ల బాన్ అనే వ్యక్తి తన వద్ద ఉన్న రెండు పెంపుడు కుక్కలను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు.వాటికి ఏం పేర్లు పెట్టాలా ఆని ఆలోచించి చివరకు ఒకదానికి చెన్‌గువాన్ మరియు రెండవ దానికి షీగువాన్ అని పేర్లు పెట్టాడు.తన కుక్కల పేర్లను సోషల్ మీడియాలో పెడుతూ వాటికి సంబంధించిన అప్‌డేట్స్ ఏదో ఒకటి ప్రతి రోజు ఇస్తూ ఉండేవాడు.అలా ఆ కుక్కల పేర్లు చాలా మందికి తెలిశాయి.
అలా అలా పోలీసుల వద్దకు ఆ కుక్కల పేర్లు వెళ్లాయి.దాంతో వెదుక్కుంటూ వచ్చి పోలీసులు బాన్‌ను అరెస్ట్ చేశారు.
బాన్ కుక్కలకు పెట్టిన పేర్లు పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను అవమానించే విధంగా ఉన్నాయట.చెన్‌గువాన్ అంటే ట్రాఫిక్ పోలసులు అని, షీగువాన్ అంటే క్రిమినల్ కేసులు ఎంక్వౌరీ చేసే పోలీసులు అని అర్థం వస్తుంది.
పోలీసులను అవమానిస్తూ పెంపుడు జంతువులకు పేర్లు పెట్టినందుకు గాను బాన్‌పై కేసు నమోదు అయ్యింది.అతడిని కోర్టు ముందు ప్రవేశ పెట్టడం జరిగింది.
మొదట తాను తెలియక పెట్టాను అంటూ చెప్పిన బాన్ ఆ తర్వాత సరదాగా పెట్టాను అంటూ చెప్పాడు.దాంతో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి అతడికి 10 రోజుల జరిమానాతో పాటు భారీ మొత్తంలో జరిమానాను విధించడం జరిగింది.
ఆ జరిమానా మొత్తంను పోలీసుల సంక్షేమ నిధికి ఉపయోగించాలని ఉన్నతాధికారులను ఆదేశించడం జరిగింది.మొత్తానికి కుక్కలకు పేర్లు పెట్టుకోవడంలో తప్పులేదు కాని, ఆ పేర్ల వల్ల ఎవరిని కించపర్చవద్దని ఈ సంఘటనతో మనం అర్థం చేసుకోవాలి.