ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలకు విలువ అనేది రోజురోజుకు తగ్గుతూ పోతుంది.కుటుంబ సభ్యులపైనే దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు కసాయి వ్యక్తులు.
మనిషి కేవలం డబ్బు, ఆస్తిపాస్తులకే విలువ ఇస్తూ వాటి కోసం ఏకంగా కుటుంబ సభ్యులను హతమార్చడానికి కూడా వెను కాడడం లేదు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.
ప్రభుత్వ ఉద్యోగి( Govt Employee ) సర్వీస్ లో ఉండగా మరణిస్తే, ఆ ఉద్యోగం కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఒకరికి ప్రభుత్వం ఇస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే.
చాలా ప్రభుత్వ సంస్థలలో ఈ రూల్ ఉంది.అయితే ఒక్కసారి కొడుకు సర్వీసులో ఉండే తన తండ్రి చనిపోతే ఆ ప్రభుత్వ ఉద్యోగం తనకే వస్తుందని, సుపారీ ఇచ్చి తన తండ్రిని చంపడం కోసం కిరాయి గుండాలను నియమించాడు.
కానీ ప్రయత్నం విఫలం కావడంతో పోలీసులకు చిక్కాడు.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.జార్ఖండ్ లోని( Jharkhand ) రామ్ గడ్ కు చెందిన రామ్ జీ ముండా( Ramji Munda ) అనే వ్యక్తి సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ లో ఉద్యోగం చేస్తున్నాడు.
ఇతని కుమారుడు 25 ఏళ్ల అమిత్ ముండా( Amit Munda ) ఉద్యోగం లేక ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు.అయితే తన తండ్రి మరణిస్తే ఆయన ఉద్యోగం తనకే వస్తుంది కదా అని ఆశపడ్డాడు.

తండ్రిని హతమార్చడం కోసం సుపారీ ఇచ్చి కిరాయి గుండాలను నియమించాడు.నవంబర్ 16న రామ్ గడ్ జిల్లాలోని( Ramgarh District ) మత్కామా చౌక్ వద్ద బైక్ పై వచ్చిన కొందరు దుండగులు రాంజీ ముండా పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు.స్థానికులు వెంటనే రాంజీని స్థానికంగా ఉండే ఆసుపత్రికి తీసుకెళ్లారు.పరిస్థితి కాస్త విషమంగా ఉండడంతో రాంజీని రాంచీలో ఉండే ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.ఈ దాడికి ప్రధాన సూత్రధారి రాంజీ కుమారుడు అమిత్ ముండా అని తెలిసింది.పోలీసులు అమిత్ ముండాను విచారించగా తండ్రి చనిపోతే ఆయన చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగం తనకే వస్తుందన్న ఆశతో కిరాయి గుండాలతో హత్య చేయాలని అనుకున్నట్లు పోలీసుల ముందు చెప్పాడు.
కిరాయి గుండాలు పరారీలో ఉన్నారని, అమిత్ ను అరెస్ట్ చేశామని, కిరాయి గుండాల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారని పట్రాటు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ బీరేంద్ర కుమార్ చౌదరి తెలిపారు.







