విశాఖపట్నంలో వివాహేతర సంబంధం కారణంగా యువకుడి దారుణ హత్య..!

ఇటీవలే జరుగుతున్న హత్యలలో సగానికి పైగా హత్యలు అక్రమ సంబంధాల( Illegal Relationships ) కారణంగానే జరుగుతూ కుటుంబాలను నాశనం చేస్తున్నాయి.కేవలం కొద్ది నిమిషాల శారీరక సుఖం కోసం ఏర్పడే వివాహేతర సంబంధాలన్నీ చివరకు విషాదంగానే ముగుస్తున్నాయి.

 Man Having Extramarital Affair Killed By Husband In Vizag Details, Extramarital-TeluguStop.com

వివాహం తర్వాత భర్త లేదా భార్య పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తే చివరికి ఆ కుటుంబం నాశనం అవుతుంది అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన విశాఖపట్నంలో( Vishakapatnam ) చోటుచేసుకుంది.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

విశాఖపట్నంలోని నాల్గవ పోలీస్ స్టేషన్ పరిధిలో శివారెడ్డి( Sivareddy ) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.అయితే అదే ప్రాంతానికి చెందిన కిషోర్ కు( Kishore ) శివారెడ్డి భార్యకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

కొంతకాలంగా వీరి మధ్య వివాహేతర సంబంధం సాఫీగానే సాగింది.భార్య అక్రమ సంబంధం గురించి శివారెడ్డికి తెలియడంతో భార్యతో పాటు కిషోర్ ను పలుమార్లు మందలించాడు.

Telugu Relationship, Kishore, Shiva, Vishakapatnam, Vizag-Latest News - Telugu

శివారెడ్డి మంచి మాటలతో ఎన్నిసార్లు మందలించిన కిషోర్ లోను, తన భార్యలోనూ మార్పు రాలేదు.ఇద్దరూ వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం భరించలేకపోయిన శివారెడ్డి ఇక కిషోర్ ను అడ్డు తొలగిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం అని భావించాడు.

Telugu Relationship, Kishore, Shiva, Vishakapatnam, Vizag-Latest News - Telugu

కిషోర్ ను హత్య చేయాలని మాస్టర్ ప్లాన్ రచించిన శివారెడ్డి ఆదివారం అర్ధరాత్రి కిషోర్ కు ఫోన్ చేసి బయటకు రావాలని చెప్పాడు.కిషోర్ రామ టాకీస్ వద్దకు రాగానే కిషోర్ ను మెడ పైనుంచి కిందకు తోసేశాడు.తీవ్ర గాయాలైన కిషోర్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube