చూస్తేనే హడలిచచ్చే మొసలిని పెంచుకుంటున్న వ్యక్తి..!

కుక్కలను, పిల్లులను, చిలుకలను చాలా మంది పెంచుకుంటారు.మన దగ్గర అయితే పెట్ లుగా కుక్కలే ఉంటాయి.

 Man Feeding Crocodile Pet Video Goes Viral Details, Man Feeding Crocodile, Crocodile Latest Video, Latest Video Viral, Crocodile Man Friendship, Pet Crorodile,-TeluguStop.com

మరికొందరు అయితే నీటి ప్రాణులను కూడా పెంచుకుంటారు.అక్వేరియం ఏర్పాటు చేసి అందులో రకరకాల అందమైన చేపలను వేసి చూసుకుంటారు.

కానీ మొసళ్లను పెంచుకోవడం గురించి ఎక్కడైనా విన్నారా.అదేంటి ఎవరైనా మొసళ్లను పెంచుకుంటారా.

 Man Feeding Crocodile Pet Video Goes Viral Details, Man Feeding Crocodile, Crocodile Latest Video, Latest Video Viral, Crocodile Man Friendship, Pet Crorodile, -చూస్తేనే హడలిచచ్చే మొసలిని పెంచుకుంటున్న వ్యక్తి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంత భయంకరంగా ఉంటాయి.వాటిని చూస్తేనే గుండెలు జారిపోతాయి.

అలాంటివి ఎవరైనా పెంచుకుంటారా.అని తిరిగి ప్రశ్నిస్తున్నారు కదూ.కానీ, ఈ వ్యక్తి మొసలిని పెంచుకుంటున్నాడు.

ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి మొసలితో స్నేహం చేస్తున్నాడు.దానికి ఎంతో ప్రేమగా ఆహారం పెడుతున్నాడు.పడవపై కూర్చున్న ఆ వ్యక్తి వద్దకు ఆ మొసలి రాగానే.దానికి ఊరించి ఊరించి మరీ ఆహారాన్ని పెడుతున్నాడు.ఈ వీడియోను ట్విట్టర్ లో TheFigen అనే ఖాతాలో ఆగస్టు 2, 2022న పోస్టు చేశారు.

ఈ వీడియో పోస్టు చేయగానే అది కాస్త వైరల్ గా మారింది.మొసలిని పెంచుకోవడం ఏంటి.

దానికి ఆహారం తినిపించడం ఏంటి.ఊరించి ఊరించి దానికి ఆహారం పెట్టడం ఏంటి.

అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియోను ఇప్పటి వరకు 48 లక్షలకు పైగా మంది చూశారు.32 వేలకు పైగా కామెంట్లు కూడా వచ్చాయి.మొసళ్లు మనుషులతో స్నేహంగా ఉంటాయని.

కానీ వాటిని పూర్తిగా నమ్మవద్దని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు.మొసళ్లు వైల్డ్ యానిమల్స్ అని వాటి స్వభావం అలాగే ఉంటుందని మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube