ప్రజలు ఒక్కోసారి తాము చేయలేని పనులు చేస్తామని భావిస్తారు.అందరి ముందు షో చేయడానికి ఏం ఆలోచించకుండా ముందుకు అడుగేస్తుంటారు.
అలాంటి మనస్తత్వం ఉన్న ఒక వ్యక్తి తాను పెద్ద టార్జాన్( Tarzan ) లాగా భావించాడు.ఆపై అతనిలాగా స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు.
కానీ అది బెడిసి కొట్టింది.దాంతో నవ్వుల పాలయ్యాడు.ఆ స్టంట్‌కు ( Stunt ) సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇది చూస్తే నవ్వు ఆపుకోలేరు.
1999లో టార్జాన్ అనే హాలీవుడ్ సినిమాలో టార్జాన్ క్యారెక్టర్ ను అడవి జంతువులు పెంచుతాయి.ఆ జంతువుల లాగానే అతడు అన్ని నేర్చుకుంటాడు.ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకు ఊగుతూ స్టంట్స్ అద్భుతంగా చేస్తాడు.కొన్నిసార్లు నదులలో( Rivers ) ఈత కొడుతూ, మరికొన్నిసార్లు చెట్ల కొమ్మలపై తీగల సహాయంతో వాటర్ సోర్సులను దాటుతూ ఆశ్చర్య పరుస్తాడు.అయితే అది కేవలం టార్జాన్‌కే సాధ్యమవుతుంది.

కానీ వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి సరిగ్గా అలాంటి స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు.ఈ వ్యక్తి తనను తాను టార్జాన్‌గా ఫీల్ అయి వాటర్ డ్రెయిన్( Water Drain ) దాటేందుకు ట్రై చేశాడు.అది ప్రమాదకరమైన పని అని అతనికి తెలుసు.అయినా ఆ పని చేయాలనుకున్నాడు.ఈ వీడియో క్లిప్‌లో సదరు వ్యక్తి నిర్మాణ కార్మికుడిలా( Construction Worker ) దుస్తులు ధరించి, పొడవాటి కలప సహాయంతో డ్రెయిన్‌కి అవతలి వైపు ఆగి ఉన్న కారును చేరుకోవడానికి ట్రై చేయడం గమనించవచ్చు.ఈ వ్యక్తి కాలువ మధ్యలో కర్రను వేసి, అదే కర్ర సహాయంతో దూకి కాలువకు అవతలి వైపుకు చేరుకోవడానికి ప్రయత్నించాడు కానీ ఫెయిలయ్యాడు.

దాంతో ఆ నీటి లోపల పడి బాగా తడుస్తాడు.అతడు ఇలా పడిపోవడానికి చూసి వీడియో రికార్డ్ చేస్తున్న ఒక మహిళ తెగ నవ్వేస్తుంది.ఈ వైరల్ వీడియోను ఫిగెన్ అనే యూజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.అతడు నీటిలో పడిపోయిన తర్వాత కూడా అటువైపు వెళ్ళకుండా ఇటువైపు ఎందుకు వచ్చాడు? అని ఈ పేజీ ఒక ప్రశ్న కూడా అడుగుతుంది.ఈ 16 సెకన్ల వీడియోకు ఇప్పటి వరకు 16 లక్షల వ్యూస్ వచ్చాయి.దీన్ని చూసి చాలామంది తెగ నవ్వుకుంటున్నారు.
మీరు కూడా చూసేయండి.







