వండర్స్ క్రియేట్ చేస్తున్న పొట్టి ఇండికా కారు... ఎలా తయారు చేయబడినది?

టాలెంట్ చూపించడంలో భారతీయులకు సాటెవ్వరూ ఉండరని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మనవాళ్ళు నిత్యం ఏదో ఒక రంగంలో అసాధారణమైన సృజనాత్మకతను చూపిస్తూ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తూ వుంటారు.

సాధారణంగా బేసిక్ గా కారు అంటే ఓ నలుగురు ప్రయాణించేలా ఉంటుంది.కానీ ఓ కారును ఊహించని విధంగా కేవలం ఇద్దరు మాత్రమే కూర్చొని ప్రయాణించేలా మనవాళ్ళు తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

దానిపేరు టాటా ఇండికా V2 హ్యాచ్‌ బ్యాక్ కారు.

దీనిని ఇక్కడ సామాన్యుడి కారు అని అంటారు.మంచి ఇంజన్ తో పాటు మైలేజ్, చిన్న చిన్న రోడ్లు కలిగిన గ్రామాలకు సైతం ఈ కారుపై అలవోకగా గమ్యాన్ని చేరుకోవచ్చు.ఇందులో ఇద్దరు మాత్రమే కూర్చొని వెళ్లగలుగుతారు.

Advertisement

ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.వసీం క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రపంచానికి పరిచయం చేసింది.

ఈ కారులో ఉన్నస్పెషాలిటీ ఏంటంటే! మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఈ కారును తయారు చేయడం జరిగింది.దాని తయారు చేసిన విధానం అందుబాటులో లేకపోయినప్పటికి ప్రపంచంలోనే అతిచిన్న కారుగా మార్చిన అనంతరం చూపించిన వీడియో హల్ చల్ చేస్తుంది.

ఇక ఈ కారు పొడవు కేవలం 8 ఫీట్లు మాత్రమే ఉంటుంది.అంటే సాధారణ కారు కంటే 3.5 ఫీట్లు ఈ కారు తక్కువగా ఉంటుందన్నమాట.ఈ కారులో వెనుక డోర్ ను పూర్తిగా తొలగించడం చూడవచ్చు.

వెనుక భాగంలోనీ కారు పిల్లర్‌ కు వెల్డింగ్ చేసి చిన్నదిగా చేశారు.దీంతో కారు పొడవును తగ్గించడం జరిగింది.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
వైరల్ వీడియో : రేవ్ పార్టీలో యాక్టర్ రోహిణి నిజంగానే దొరికిందా లేక ప్రాంకా..?

కస్టమర్ డిమాండ్‌ కు అనుగుణంగా కారు బానెట్‌ ను రూపొందించారు.కారును చిన్నగా చేసేందుకు ఇంజన్ లో ఎలాంటి మార్పులు లేకుండా దీనిని తయారు చేశారు.

Advertisement

కారు వెనక భాగాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.అదే విధంగా కారు పై భాగంలో కస్టమ్ ఫాబ్రికేటెడ్ రియర్ స్పాయిలర్, రూఫ్ రెయిల్‌ లు అమర్చారు.

తాజా వార్తలు