ముఖ్యమంత్రి పిఏ అంటూ ఏకంగా..?!

సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల పేర్లు చెప్పుకొని కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు.ఇక గతంలో కేటీఆర్ పీఏ నంటూ గతంలో ఓ వ్యక్తి మోసాలకు పాల్పడిన విషయం తెలిసిందే.

 Man Cheated By Introducing Himself As Cm Kcr Personal Assistant In Hyderabad, C-TeluguStop.com

దీంతో అతడ్ని గుర్తించి పోలీసులు కటాకటాల వెనక్కి పంపారు.తాజాగా మరో వ్యక్తి సీఎం కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శినంటూ నమ్మించి.

ఓ వ్యక్తి జోతిష్యుడిని మోసం చేశాడు.అయితే తన వద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కూకట్‌పల్లిలో స్థలం ఇప్పిస్తానంటూ రూ.25 లక్షలు కాజేశాడు.ఈ ఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

ఇక పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.దేవీ శైలేంద్రనాథ్‌ అనే వ్యక్తి ఎస్‌ఆర్‌నగర్‌లోని స్వస్థిక్‌ ప్లాజా హిమాలయా బుక్‌ స్టోర్‌ పైఅంతస్తులో నివాసముంటున్నాడు.ప్రసార మాధ్యమాల ద్వారా శైలేంద్రనాథ్‌ గురించి తెలుసుకుని ఓ వ్యక్తి వచ్చాడు.తన పేరు సుధాకర్‌ అని తాను సీఎం కేసీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శిగా పరిచయం చేసుకున్నాడు.

పలుమార్లు జాతకం చూపించుకున్న సుధాకర్‌ వెంట ఇద్దరు గన్‌మెన్లు కూడా ఉండటంతో పాటు వారి వద్ద గన్స్‌ కూడా ఉండేవి.కూకట్‌పల్లిలో ఓ చోట ప్రభుత్వ స్థలం ఉందని, అది మీకు వచ్చేలా చూస్తానని, అందులో ఆధ్యాత్మిక కేంద్రం పెట్టుకోవచ్చని నమ్మించాడు.

దీంతో సుధాకర్ మాటలు నమ్మిన శైలేంద్ర విడతల వారీగా కొత్త మొత్తాన్ని కూడా చెల్లించాడు.2019 నుంచి 2021 ఫిబ్రవరి వరకు రూ.25 లక్షలు ఇచ్చాడు.అయితే డబ్బులు తీసుకుని సంవత్సరాలు గడస్తున్నా స్థలం మాత్రం ఇప్పించకపోవడంతో శైలేంద్రకు అనుమానం వచ్చింది.

దీంతో తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని శైలేంద్ర కోరారు.డబ్బులు అడిగితే గన్‌తో కాల్చి చంపేస్తానని బెదిరించడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube