ప్రస్తుత రోజులలో చిన్న చిన్న వాటికే తెలిసి తెలియక నిర్ణయాలు తీసుకోవడంతో నిండు ప్రాణాలను కోల్పోయిన సంఘటనలు మనం నిత్యం వార్తలలో చూస్తూనే ఉన్నాము.ప్రస్తుత జీవన శైలిలో చాలా మంది తీవ్ర మనోవేదనకు గురి అయ్యి ఆత్మహత్యకు పాల్పడుతూ ఉన్నారు.
అచ్చం అలాంటి సంఘటన ఒకటి తాజాగా జరిగింది.ఒక వ్యక్తి ఉద్యోగం కోల్పోయాడని( Lost Job ) తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది.
అతడు ఆత్మ హత్యకు పాల్పడ్డ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే, ఇది గమనించిన అక్కడి స్థానికులు వెంటనే అతడి ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నం చేశారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్తే.నోయిడాలోని( Noida ) సూపర్‌టెక్ కేప్ టౌన్ హౌసింగ్ సొసైటీ అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి కిందుకు దూకే ప్రయత్నం చేయగా.
ఇది గమనించిన స్థానికులు అతని వద్దకు వెళ్లి పైకి లాగే ప్రయత్నం చేశారు.అయితే అతడు అనుకోకుండా కిందికి జారిపోయాడో లేక కావాలనే సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించి మధ్యలో భయం వేసిందో తెలియదు కానీ.
కొంచెం ఉంటే తన ప్రాణాలు కోల్పోయేవాడు.
ఈ సంఘటనకు సంబంధించి మొత్తం ఒక వ్యక్తి షూట్ చేసి అది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది.ఈ వైరల్( Viral ) అవుతున్న వీడియోను చూసిన కొంతమందిని నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఆత్మహత్య చేసుకోవాలంటే ఇలాంటి ప్లాన్స్ ఎందుకు భయ్యా అని కొందరు కామెంట్ చేస్తుండగా.
ఇక మరికొందరు స్థానికులు కాపాడకుండా ఉండి ఉంటే ఆ వ్యక్తి పరిస్థితి ఏమిటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అది ఏమైనా ఓ వ్యక్తి ప్రాణం కాపాడబడింది అది చాలు.