తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ మమతా మోహన్ దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హెరిగా నటించిన యమదొంగ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.
మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు ఏర్పరచుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది.ఆ తర్వాత క్యాన్సర్ మహమ్మారి కారణంగా సినిమాలకు దూరం అయింది.
అయితే క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న సమయంలో చికిత్స తీసుకుంటూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆ క్యాన్సర్ వ్యాధికి సంబంధించి అవగాహన కల్పిస్తూ వచ్చింది.

అంతే కాకుండా తన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అభిమానులకు అప్డేట్స్ ఇస్తూ వచ్చింది.క్యాన్సర్ మహమ్మారితో సుదీర్ఘ కాలం పాటు పోరాడి చివరికి గెలిచింది.క్యాన్సర్ తో నుంచి పోరాడి గెలిచిన తర్వాత మమతా మోహన్ దాస్ తిరిగి సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం కేవలం నటనకు ప్రాధాన్యమైన పాత్రలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.ఇది ఇలా ఉంటే మమతా మోహన్ దాస్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే మమతా మరొక అదుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.ఇదే విషయాన్ని తాజాగా ఆమె తెలిపింది.

తాను చర్మం రంగు కోల్పోయే వీటిలిగో అనే క్రానిక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధపడుతున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది.కాగా వీటిలిగో అనేది బొల్లి తరహా వ్యాధి.తాజాగా ఈమె ఇదే విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ ఈ విధంగా రాసుకొచ్చింది.డియర్ సన్ నీ కిరణాలను చూడడానికి నీ కంటే ముందే నిద్రలేస్తున్నాను.
నీ శక్తినంత నాకు ఇవ్వండి.ఇప్పటికీ రుణపడి ఉంటాను అని రాసుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ.
కాగా మమత మోహన్ దాస్ కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా పాటలు కూడా పాడినప్పించిన విషయం తెలిసిందే.అయితే మొన్నటి వరకు క్యాన్సర్ మహమ్మారితో పోరాడి గెలిచిన ఈమె మరొకసారి ఇలాంటి చర్మానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉండడంతో ఆ వార్త విన్న ఆమె అభిమానులు షాక్ అవ్వడంతో పాటు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.







