అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరిగిన విషయం తెలిసిందే.నందిగ్రామ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తనపై పథకం ప్రకారం దాడి జరిగిందని, నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని మమత ఆరోపించిన సంగతి తెలిసిందే.
కానీ ఈ ఘటనలో మమతా పై దాడి జరగలేదని, మమత వాహనంలో నుంచి కొద్దిగా బయటకు వచ్చి జనాలకు అభివాదం తెలుపుతున్నారు.ఈ క్రమంలో దీదీని చూడటానికి జనాలు ఒక్కసారిగా పరిగెత్తుకురావడంతో కారు డోరు ఆమె కాలికి తగిలి గాయం అయ్యిందని, అంతే తప్ప ఆమె మీద ఎవరు దాడి చేయలేదు అని ప్రచారం జరుగుతుంది.
ఇకపోతే మమతా బెనర్జీ ఈ రోజు మధ్యహ్నం ప్రచారంలో పాల్గొననున్నట్లు తృణముల్ కాంగ్రెస్ తెలిపింది.గాంధీ మూర్తి నుంచి హజ్రా వరకు వీల్ చైర్ పై రోడ్ షో నిర్వహిస్తారని సమాచారం.
అదీగాక ఈ రోజు మధ్యహ్నం హజ్రాలో బహిరంగ ర్యాలీలో మమత ప్రసంగించనున్నారని వెల్లడించారు.