మీడియాపై మాళవికా మోహనన్ ఫైర్.. అసభ్యకరమైన ఫోటో షేర్ చెయ్యడంతో!

సాధారణంగా కొన్ని సార్లు సినీతారలు వారికి తెలియకుండానే వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన  పరిస్థితులు ఏర్పడతాయి.సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత టెక్నాలజీని ఉపయోగించుకొని సినీతారల ప్రమేయం లేకుండా వారి ఫోటోలను మార్పింగ్ చేయడం, ఎడిట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మనం చూస్తున్నాము.

 Malvika Mohanan Fires On Media By Sharing Obscene Photo Malvika Mohanan, Bollyw-TeluguStop.com

ఇలా హీరోయిన్స్ ప్రమేయం ఏ మాత్రం లేకుండా ఇలాంటివన్నీ జరిగి పోతుంటాయి.తాజాగా ఇలాంటి ఘటన మలయాళ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ విషయంలో జరిగింది.

2013వ సంవత్సరంలో పట్టం పోలే అనే మలయాళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన మాళవికా మోహనన్ అనంతరం పలు తమిళ, మలయాళ, హిందీ చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఎన్నో సినిమాలతో ఎంత బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా మీడియాపై, అదే విధంగా తమిళ అభిమానుల పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉన్నఫలంగా ఈ ముద్దుగుమ్మ మీడియాపై ఈ విధంగా చురకలు వేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.

Telugu Bollywood, Malvika Mohanan-Movie

కొంత మంది తమిళ మీడియాకు చెందిన వారు ఈమె ఫోటోని మార్ఫింగ్ చేస్తూ పోస్ట్ చేశారు.ఈ క్రమంలోనే కొంత మంది తమిళులు ఆ ఫోటోని వైరల్ చేశారు.ఈ విధంగా ఎంతో అసభ్యకరంగా ఉన్న ఆ ఫోటో మాళవిక దృష్టికి రావడంతో ఈమె తమిళ మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఈమె స్పందిస్తూ… చీప్ జర్నలిజం అంటూ కామెంట్ చేశారు.ఇక ఈమె సినీ కెరీర్ విషయానికి వస్తే స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈమె ఇప్పటి వరకు ఒక తెలుగు సినిమాలో కూడా నటించలేదు.

తమిళ ఇండస్ట్రీలో ఏకంగా రజనీ కాంత్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన మాళవిక మోహనన్ ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాకపోవడానికి కారణం తెలియడంలేదు.ఈమె తెలుగు తెరకు పరిచయం కాకపోవడానికి గల కారణం తెలుగు నిర్మాతలు ఈమెను గుర్తించలేదా లేకపోతే ఎన్నో భాషలలో ఎంతో బిజీగా ఉన్న ఈమెకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చేయాలని ఆలోచన రాలేదో కానీ ఇది మాత్రం ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఒక తెలుగు చిత్రంలో కూడా నటించలేదు.

అయితే ఒకానొక సమయంలో ఈమెకు రవితేజ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఈమె ఆ సినిమాలో నటించడానికి తిరస్కరించినట్లు తెలుస్తోంది.

Telugu Bollywood, Malvika Mohanan-Movie

సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే మాళవికా మోహనన్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాల గురించి సినిమాల గురించి సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ రోజురోజుకు అభిమానులను పెంచుకుంటూ మాళవిక తరచూ తన గ్లామరస్ ఫోటోలను కూడా షేర్ చేసే వారు.ఈ విధంగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మకు తన ప్రమేయం లేకుండా తన ఫోటోల విషయంలో ఇలా జరగడంతో ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సదరు మీడియా పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube