ఓటిటి లో సందడి చేస్తున్న మలయాళ సినిమా...

కొన్ని సినిమాలు చూడటానికి చాలా సింపుల్ పాయింట్స్ తో తెరకెక్కుతాయి కానీ వాటి వల్ల చాలా మంది జనాలలో మార్పు అనేది వస్తుంది అలాంటి సినిమాలు తెలుగు లో ఇప్పటి వరకు చాలానే వచ్చాయి అయితే కొన్ని సినిమాలు ఎమోషన్స్ తో కట్టిపడేస్తాయి నిజానికి రీసెంట్ గా మన తెలుగు లో వచ్చిన బలగం సినిమా( Balagam Movie ) చాలా పెద్ద సక్సెస్ సాధించింది అలాగే చాలా మంచి ఎమోషనల్ సినిమా గా కూడా గుర్తింపు పొందింది…

 Malayalam Movie Neymar Streaming On Disney Plus Hotstar From August 8 Details, M-TeluguStop.com

అయితే ఒక్కో సినిమా ఒక్కో అనుభూతిని ఇస్తుంది… తాజాగా అలాంటి కంటెంట్ తో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో స్ట్రీమింగ్ కి వచ్చింది.ఆ చిత్రం పేరు ‘నెయిమర్’.

( Neymar ) ఈ మూవీ మే 12న థియేటర్లలో రిలీజ్ అయ్యి, విజయవంతంగా 50 రోజులను పూర్తి చేసుకుంది.ఈ చిత్రం ఆగస్ట్ 8 నుండి ప్రముఖ ఓటీటీ హాట్ స్టార్( Hotstar ) అందుబాటులోకి వచ్చింది.ఆ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

 Malayalam Movie Neymar Streaming On Disney Plus Hotstar From August 8 Details, M-TeluguStop.com
Telugu Sudhi Maddison, Disney Hot, Malayalam, Mathew, Neymar-Movie

నెయిమర్ మూవీలో మాథ్యూ థామస్ , నస్లెన్, జానీ ఆంటోని, షమ్మీ తిలకన్, విజయరాఘవన్ కీలక పాత్రలలో నటించారు.ఈ చిత్రానికి సుధీ మాడిసన్ దర్శకత్వం వహించారు.ఇక కథ విషయానికి వస్తే, ఇద్దరు ఫ్రెండ్స్ కుంజవ (మాథ్యూ థామస్) మరియు సింటో (నస్లెన్ ) ఫుట్‌బాల్ అభిమానులు, అయితే వారి తండ్రుల ఒకప్పుడు మంచి మిత్రులు అయినప్పటికీ మనస్పర్ధలతో విడిపోతారు.కుంజవ,( Kunjava ) సింటో( Sinto ) ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేయాలని భావిస్తారు.అదే సమయంలో కుంజవ డోనా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు…

Telugu Sudhi Maddison, Disney Hot, Malayalam, Mathew, Neymar-Movie

ఆమెకు కుక్కపిల్లలంటే ఇష్టమని తెలుసకుని ఒక వీధికుక్కను తీసుకుని వస్తాడు.దాని పేరే ‘నెయిమర్’.అది వచ్చిన తరువాత వారి జీవితాలలో వచ్చిన ఊహించని మలుపులు ఏమిటి అనేది మిగతా కథ.సినిమా మొదటి సగంలో, ప్రేక్షకులకు కుంజవా, సింటో మరియు వారి కుటుంబాలను పరిచయం చేశారు.ఆ తరువాత నెయిమర్ అనే కుక్క వారి జీవితంలోకి ఎలా వస్తుంది.ప్రతి ఒక్కరి పై ఎలాంటి ప్రభావం చూపింది.అనే విషయాన్ని వినోద భరితంగా సాగుతుంది…

సెకండాఫ్ గాబ్రియల్ కు వెంకట్ తో ఉన్న శత్రుత్వం మరియు ఒకరి మీద మరొకరు గెలవడానికి చేసే ప్రయత్నాలు.వారిద్దరి పరువు ప్రతిష్ఠలు ‘నెయిమర్’ తో ముడిపడి ఉండటం కొంచెం సస్పెన్స్ తో నడుస్తుంది.

క్లైమాక్స్ లో డైరెక్టర్ సున్నితమైన భావోద్వేగాలతో ముడిపడిన అంశాలను చూపించారు.ఆ సీన్స్ సందేశాన్ని ఇవ్వడమే కాకుండా మూవీ చూసిన వారిని ఆలోచించెలా చేస్తాయి.

కంటతడి పెట్టిస్తాయి…ఇక ఈ సినిమా ని ఒటిటి లో ఎంత మంది ఆదరిస్తారు అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చెయ్యక తప్పదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube