'2018' తెలుగు లో ఎంత సాధించగలదు?

మలయాళం లో సూపర్ హిట్ అయిన 2018 సినిమా( 2018 movie ) ను తెలుగు లో డబ్‌ చేసి తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.కేవలం నాలుగు అయిదు కోట్ల బడ్జెట్‌ తో రూపొందించిన 2018 సినిమా మలయాళ ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్‌ అయ్యింది.

 Malayalam Movie 2018 Telugu Collections ,bunny Vasu , 2018 Telugu Collections ,-TeluguStop.com

దాంతో అక్కడ ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయ్యింది.కేవలం వసూళ్ల పరంగానే కాకుండా ఇతర బిజినెస్‌ ల పరంగా కూడా 2018 సినిమా కుమ్మేసింది.

ఇప్పుడు తెలుగు లో కూడా భారీగా ఈ సినిమా వసూళ్లు సాధిస్తుంది అనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

Telugu Telugu, Bunny Vasu, Geetha, Malayalam, Teugu, Tollywood-Movie

గీతా ఆర్ట్స్ కు చెందిన బన్నీ వాసు( Bunny Vasu) ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌ లో ఈ సినిమా ను అల్లు అరవింద్ సమర్పించడం జరిగింది.ఈ మధ్య కాలంలో బన్నీ వాసు తీసుకు వచ్చిన సినిమా లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

కాంతార సినిమా కూడా గీతా ఆర్ట్స్ 2( Geetha Arts 2 ) నుండి డబ్‌ అయ్యి తెలుగు లో విడుదల అయిన విషయం తెల్సిందే.

Telugu Telugu, Bunny Vasu, Geetha, Malayalam, Teugu, Tollywood-Movie

ఇప్పుడు ఈ సినిమాను కూడా భారీ గా విడుదల చేయడం జరిగింది.2018 సినిమా తెలుగు లో పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకుంది.రివ్యూలు కూడా పాజిటివ్‌ గా వచ్చాయి.

సినిమా డబ్బింగ్‌ మరియు ప్రమోషన్‌ కోసం బన్నీ వాసు దాదాపుగా కోటిన్నర రూపాయలు ఖర్చు చేసినట్లుగా సమాచారం అందుతోంది.మూడు కోట్ల రూపాయలు వచ్చినా కూడా ఆయనకు డబుల్‌ ప్రాఫిట్‌ అన్నట్లుగా చెప్పుకోవచ్చు.

కానీ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్‌ ను బట్టి అయిదు నుండి ఆరు కోట్ల షేర్‌ కలెక్షన్స్ ను ఈ సినిమా దక్కించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.అదే జరిగితే బన్నీ వాసు కు భారీ లాభాలు దక్కడం ఖాయం.2018 సినిమా తెలుగు లో 10 కోట్ల వసూళ్లు సాధిస్తే అద్భుత విజయం అనే టాక్ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube