రౌడీ స్టార్ తో రొమాంటిక్ చిత్రం చెయ్యాలనుకుంటున్న బ్యూటీ.. ఆమె కోరిక తీరేనా?

బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ మాళవికా మెహనన్ గురించి మనందరికీ తెలిసిందే.మాళవికా మెహనన్ పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈమెకు హీరోయిన్ గా మాత్రం సరైన హిట్ రాలేదు.

 Malavika Mohanan To Wants Act Rowdy Hero Vijay Devarakonda Malavika Mohanan, Vij-TeluguStop.com

అంతేకాకుండా ఆమె నటించిన సినిమాలలో కూడా ప్రాధాన్యత లేని పాత్రల్లోనే కనిపించడంతో సరైన గుర్తింపును సొంతం చేసుకోలేక పోయింది.ఇక సూపర్ స్టార్ తో కలిసి పేట్టా, దళపతి విజయ్ తో మాస్టర్ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రముఖ సినిమాటో గ్రాఫర్ అయినా కె.యు మోహనన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన మాళవికా మెహనన్ కు కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు వరుసగా క్రేజీ ఆఫర్లు లభించాయి.

కానీ ఎన్ని క్రేజీ ఆఫర్లు వచ్చినా అవి ఆమె కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడలేకపోయాయి.టాలీవుడ్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట్టసినిమాలో అవకాశం లభించింది.కానీ పాత్రకు తగ్గ ప్రాధాన్యత లేదు.అలాగే విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో కూడా ఇదే పరిస్థితి.

పేరుకు హీరోయిన్ రోల్ కానీ విజయ్ తో ఎక్కువగా సన్నివేశాలు లేవు.రొమాంటిక్ సీన్ కానీ సాంగ్ కానీ లేదు.

ఒక్కటంటే ఒక్క డ్యుయెట్ కూడా లేదు.దీంతో మాళవికకు మాస్టర్ పెద్దగా కలిసి రాలేదు అని చెప్పవచ్చు.

ఇటీవల ధనుష్ తో మారన్ సినిమాలో నటించినప్పటికి అది కాస్తా ఓటీటీకే పరిమితం కావడంతో తనకు పెద్దగా పేరు రాలేదు.

Telugu Bollywood, Danush, Rajanikanth, Tollywood, Yudra-Movie

ఇదిలా ఉంటే కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది మాళవికా మెహనన్.ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వరుస హాట్ ఫోటో షూట్ లతో హల్ చల్ చేస్తూ ఉంటుంది.ఇకపోతే మాళవికా మెహనన్ ప్రస్తుతం హిందీలో యుద్ర పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈమె తన ఆశలన్నీ కూడా ఈ సినిమాపైనే పెట్టుకుంది.ఈ సినిమాతో అయినా తన కెరీర్ కొత్త మలుపు తిరుగుతుంది అని ఆశిస్తోంది.ఇది ఇలా వుంటే సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ గా వుండే మాళవిక మోహన్ తాజాగా #AskMalavika అంటూ అభిమానులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించగా అందులో పాల్గొన్న అభిమానులు పలు ఆసక్తికరమైన ప్రశ్నల్ని సంధించారు.ఇక అభిమానులు అడిగిన ప్రశ్నలకు కూల్ గా సమాధానం చెప్పింది మాళవిక.

ఈ క్రమంలోనే ఒక అభిమాని తమిళ బిగ్ స్టార్స్ అయిన రజనీకాంత్ విజయ్ లతో కలిసి నటించారు.ఇప్పడు ఎవరితో కలిసి నటించాలని ఎదురుచూస్తున్నారు? అని అడగగా.విజయ్ దేవరకొండ తో కలిసి రొమాంటిక్ లేదా రోమ్ కోమ్ సినిమా చేయాలని వుందని తన మనసులోని మాటని బయటపెట్టింది మాళవికా మెహనన్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube