బ్రహ్మజెముడు నుంచి లిప్‌స్టిక్ తయారీ.. వైరల్ అవుతున్న వీడియో..!

సాధారణంగా మైనం, నూనె, రంగు, ప్రిజర్వేటివ్స్ వంటి రకరకాల పదార్థాలు కలిపి లిప్‌స్టిక్‌ను తయారుచేస్తారు.వీటిని తయారు చేసే పద్ధతి అనేక రకాలుగా ఉంటుంది.

 Making Lipstick From Brahmajemudu Video Going Viral ,lipstick, Making, Viral La-TeluguStop.com

ఒక్కొక్కరు ఒక్కోలా డిఫరెంట్ పదార్థాలు వాడతారు.అయితే తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో మాత్రం ఒక వ్యక్తి చిత్రవిచిత్రమైన తయారీ పద్ధతిలో లిప్‌స్టిక్‌ను ప్రిపేర్ చేశాడు.

ఈ వ్యక్తి వాడేసిన సిరంజిలు, ముండ్లజెముడు ఆకులు, నూనె వంటి పదార్థాలతో ఒక బాంబు తయారు చేసినంత బిల్డప్ ఇచ్చాడు.బ్రహ్మజెముడు ఆకులను ఎండలో ఎండబెట్టి వాటికి ఏవేవో పొడులు కలిపాడు.

చివరికి అందులో ఎర్రటి రంగు కలిపేశాడు.ఆ తర్వాత కొన్ని పొడులను రోట్లో దంచుతూ కనిపించాడు.

ఈ తయారీ ప్రక్రియ అంతా నెటిజనులకు పిచ్చెక్కిస్తోంది.ఈ వీడియోను స్క్రీమర్ జిమ్ అనే పేజీ ట్విట్టర్‌లో షేర్‌ చేయగా.

దీనికి కోటి వరకు వ్యూస్ వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే.

ఒక వ్యక్తి వాడేసిన సిరంజిలను వేడి నీళ్లలో ముంచి వాటిని శుభ్ర పరచడం చూడొచ్చు.ఆపై సిరంజిల సూదులను కట్ చేసి తర్వాత బ్రహ్మజెముడు ఆకులకు అగ్గిపెట్టెలను జత చేస్తాడు.ఆపై వాటిని ఎండలో ఆరబెట్టాడు.అగ్గిపెట్టెలలో ఏదో పొడి చల్లుతాడు.అనంతరం ఆకుల మైనాన్ని ఎరుపు రంగుగా మారుస్తాడు.చివరికి ఏదేదో చేసి కొంచెం నూనె, నీళ్లతో ఆ మైనాన్ని మరిగించి, సిరంజిల్లో ఫిల్ చేస్తాడు.

అప్పుడు అది ఒక లిప్‌స్టిక్‌గా మారుతుంది.ఈ క్లిప్‌లో లిప్‌స్టిక్‌ను పెదాలకు కూడా అతను రాసుకుంటాడు.

అప్పుడు అతని పెదాలు ఎర్రగా అవుతాయి.

“ఈ తయారీ ప్రక్రియ చివరికి ఎక్కడికి వెళుతుందో మీరు నీ జీవితాంతం ఆలోచించిన గెస్ చేయలేరు” అని ఈ పోస్ట్ క్యాప్షన్‌ పెట్టారు.దీన్ని చూసి చాలా మంది నెటిజన్లు ఇదేం తయారీ ప్రక్రియ బాబోయ్ అని జుట్టు పీక్కుంటున్నారు.మరికొందరు ఫన్నీ గా కామెంట్లు చేస్తున్నారు.

ఇది నిజంగా నిజమేనా అని ఇంకొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ చిత్రమైన వీడియోని మీరు కూడా వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube