రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.ఈయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం RC 15 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు.
అలాగే రామ్ చరణ్ సరసన కియార అద్వానీ,అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ప్రకటించారు.ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి అంజలి రామ్ చరణ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
ఈ ఫోటోలు చూసినటువంటి అభిమానులు సంతోషం వ్యక్తం చేసిన మరోవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇలా షూటింగ్ లొకేషన్లో నుంచి ఫోటోలు వరుసగా లీక్ అవడంతో సినిమా పై ఎలాంటి థ్రిల్ ఉండదని ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమా నుంచి ఇది మొదటి సారి కాదు ఇప్పటికే ఎన్నో మార్లు ఇలా ఫోటోలు లీక్ అయ్యాయని ఇలా సినిమా షూటింగ్ లోకేషన్ నుంచి ఫోటోలు లీక్ అవుతుంటే నిర్మాతలు ఏం చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.ఇలా ఫోటోలు లేక్ అవడంతో ఈ విషయంపై నిర్మాత దిల్ రాజు స్పందించారు.ఈ క్రమంలోని ఈ ఫోటోలు లీక్ అవడం వెనుక ఎవరి ప్రమేయం ఉంది అనే విషయంపై దర్యాప్తు చేయాలని చిత్ర బృందాన్ని కోరినట్లు తెలుస్తోంది.ఇకపై ఇలాంటి లీకులు కాకుండా తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవాలని ఈయన ఆదేశించారట.
ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ రాజమండ్రిలో జరుపుకుంటున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోని రాజమండ్రిలో షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.