మజిలీ సినిమా రీమేక్ కు కలెక్షన్ల వర్షం.. ఎన్ని రూ.కోట్లో తెలుసా?

సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ జెనీలియా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జెనీలియా పేరు వినగానే ముందుగా బొమ్మరిల్లు సినిమా గుర్తుకు వస్తూ ఉంటుంది.

ఈ సినిమాలో హాసిని పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది.ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఢీ, బొమ్మరిల్లు, ఆరెంజ్, సత్యం, హ్యాపీ, సై లాంటి సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

ఇకపోతే జెనీలియా బాలీవుడ్ హీరో రితేష్ దేశముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.దేశ దేశముఖ్ తో కలిసి ఈమె పలు హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.

ఇక పెళ్లి తర్వాత పూర్తిగా ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఇంటికి పరిమితమైంది జెనీలియా.ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్న విషయం తెలిసిందే.ఇటీవల కాలంలో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది జెనీలియా.

Advertisement

ఈ క్రమంలోనే భర్త రితేష్ దేశ దేశముఖ్ తో కలిసి ఒక సినిమాలో నటించింది.రితేష్, జెనీలియా ఇద్దరూ కలిసి నాగచైతన్య, సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన మజిలీ సినిమా మరాఠీ రీమేక్ లో నటించారు.

తెలుగులో మజిలీ సినిమాకు శివ నిర్వాన దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.మజిలీ సినిమా మరాఠీలో వేద్ అనే పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే.

ఇందులో రియల్ లైఫ్ లో జంట అయినా రితేష్, జెనీలియా జంటగా నటించారు.

కాగా ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.15 కోట్ల తో రూపొందిన ఈ సినిమా 15 రోజుల్లోనే దాదాపుగా 45 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.హిట్ టాక్ ని తెచ్చుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ కురిపిస్తోంది.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?

అంతే కాకుండా మరాఠీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సైరాట్ సినిమా తరువాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కూడా ఈ వేద సినిమా నిలిచింది.మరాఠిలో సైరాట్ సినిమా 110 కోట్లు కలెక్షన్స్ ను సాధించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు